EPAPER

Investment Schemes:- అత్యుత్తమ పెట్టుబడి పథకాలు.. పిల్ల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు లాభం

Investment Schemes:- అత్యుత్తమ పెట్టుబడి పథకాలు.. పిల్ల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు లాభం


Investment Schemes:- పిల్లల భవిష్యత్ కోరుకునే తల్లిదండ్రులకు గాని, ఉద్యోగ విరమణ చేసి లైఫ్‌ను ప్రశాంతంగా లీడ్ చేయాలనుకునే వారు గాని.. ఒక లక్ష్యం పెట్టుకుని ఇళ్లు లేదా ఆస్తులు కొనాలనుకునే వారు.. ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్‌ను గట్టిగానే చేసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలైతే బెటర్. సేఫ్ రిటర్న్స్ ఇస్తాయి. గవర్నమెంట్ స్కీమ్స్ సెలెక్ట్ చేసుకున్నా సరే.. సొంత ఎంక్వైరీ చాలా ఇంపార్టెంట్. అన్ని విషయాలు తెలుసుకుని మరీ అడుగువేయాలి. మన ఇన్వెస్ట్‌మెంట్ గోల్ ఏంటి? ట్యాక్స్ మినహాయింపులు ఏ పథకాలు ఇస్తాయి, రిస్క్ ఎంత… ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి.

అధిక రాబడులు రావాలి, సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు కూడా దక్కాలి అనుకునే వాళ్లు.. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ ఎంచుకోవాలి. ఈఎల్ఎస్ఎస్ అనేదిక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఒక ఆప్షన్. ఇందులో మూడేళ్ల లాక్-ఇన్ పిరియడ్‌ ఉంటుంది. ఈ స్కీమ్‌లో మంచి లాభాలే కాకుండా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందే వెసులుబాటు ఉంటుంది.


నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్. ఇది ఒక ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. ఈ స్కీమ్‌లో వడ్డీ రేటు ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. ఐదేళ్ల లాక్-ఇన్ పిరియడ్‌లో ఇదే వడ్డీ వర్తిస్తుంది. ఈ స్కీమ్‌లో ఆర్జించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. అయితే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఇన్వెస్టర్లు పన్ను మినహాయింపును పొందే వెసులుబాటు ఉంటుంది.

సీనియర్ సిటిజన్లు కచ్చితంగా సేవింగ్స్ స్కీమ్స్‌లో ఉండాల్సిందే. ఇందుకోసం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్‌లో ఎక్కువ వడ్డీ వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి. కేవలం రిటైర్మెంట్ కోసమే కాదు.. పిల్లల అవసరాల కోసం కూడా ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు.

ఇంట్లో ఆడపిల్లలు ఉంటే.. ఆలస్యం చేయకుండా సుకన్య సమృద్ధి యోజన పథకంలో జాయిన్ చేయాలి. పదేళ్లలోపు ఆడపిల్లల పేరు మీద బ్యాంకులో అకౌంట్ తెరిచి సేవింగ్స్ చేస్తుండాలి. ఆడపిల్లలను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బెస్ట్ పథకాల్లో ఇదే నెంబర్ వన్. ఈ పథకం కింద అధిక వడ్డీ రేటు అందించడంతోపాటు పన్ను ప్రయోజనాలు కూడా దక్కుతాయి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. పైగా పెట్టుబడికి సురక్షితమైన పథకం కూడా. అధిక వడ్డీరేటు ఇవ్వడం ఇందులోని అదనపు ప్రయోజనం. తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ పథకం ద్వారా వచ్చే రాబడిపై ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఏడాదికి లక్షన్నర వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. పిల్లల కోసం కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది. పిల్లల చదువుల కోసం 15 ఏళ్లలో 25 లక్షలు కావాలనుకుంటే ఏడాదికి లక్ష చొప్పున సేవ్ చేస్తే.. అనుకున్న సమయానికి అనుకున్న అమౌంట్ చేతికొస్తుంది. 

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

×