EPAPER

House Or Land:- ఇల్లు లేదా స్థలం కొనేందుకు వెళ్తున్నారా.. ఈ చెక్ లిస్ట్ చూడండి

House Or Land:- ఇల్లు లేదా స్థలం కొనేందుకు వెళ్తున్నారా.. ఈ చెక్ లిస్ట్ చూడండి


House Or Land:- ఇల్లు లేదా స్థలం కొంటున్నామంటే… రెండు కారణాలకే. ఒకటి సొంత అవసరాలకు, రెండోది పెట్టుబడికి. ఏదైనా సరే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటే. కొనుక్కున్న ఇంట్లోనే ఉండాలనుకుంటున్నప్పుడు.. చాలా ఆలోచించి తీసుకోవాలి. ప్రధానంగా క్వాలిటీ. దాన్ని కడుతున్న లేదా కట్టిన బిల్డర్. ఎందుకంటే.. జీవితాంతం ఫ్యామిలీతో కలిసి ఉండాల్సింది అందులోనే కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా వర్షాకాలంలో కొనాలనుకుంటున్న ఇల్లు చూసుకుని రావడం బెటర్. అప్పుడే కదా.. భారీ వర్షాలకు ఆ ఏరియా మునుగుతుందో లేదో తెలుస్తుంది. సో, ఇల్లు కొనడానికి ఎంక్వైరీ చేయాల్సిన రైట్ టైం వర్షాకాలం.

ఇక తరువాత చూడాల్సింది అనుమతులు. బిల్డర్ నుంచి కొంటున్నప్పుడు ఆ కంపెనీ హిస్టరీ చూసుకోవాలి. మేనేజ్‌మెంట్ అప్రూవల్ డాక్యుమెంట్, బిల్డింగ్ లేఔట్ పర్మిషన్, ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్‌, నాన్-అగ్రికల్చర్ పర్మిషన్, వాటర్ కనెక్షన్, ఫైర్ సేఫ్టీ నుంచి ఎన్ఓసీ.. ఇవన్నీ చేసుకోవాలి. అన్నిటికంటే ముందు బిల్డ‌ర్ ట్రాక్ రికార్డ్, ఎన్ని ప్రాజెక్ట్‌లు కట్టాడు, వాటి క్వాలిటీ ఎలా ఉంది, ఎప్పటి లోగా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు వంటి వివరాలు తెలుసుకోవాలి. పైగా రెరా పర్మిషన్ ఉందో లేదో చూసుకోవాలి. వీలైతే.. లాయర్ దగ్గరికి వెళ్లి వెరిఫై చేయించుకోవడం బెటర్.


మెయిన్‌గా కనెక్టివిటీ చూసుకోవాలి. స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్, మార్కెట్ ఉన్న దగ్గర ఇల్లు తీసుకుంటే.. చాలా టైం కలిసొస్తుంది. లేదంటే.. కనీసం ఆఫీసుకు దగ్గర్లో ఉన్న ప్రాంతంలోనైనా తీసుకోవాలి. ఎనీటైం ఇంటికి చేరుకునేలా ఉండాలి ఆ ప్రాంతం. సపోజ్ ఊరికివెళ్లి వస్తున్నారనుకుందాం. ఏ అర్థరాత్రో పిల్లలతో కలిసి దిగితే.. మీ ఏరియాకు రావడానికి ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులో ఉండే చోట ఇల్లు కొనుక్కోవాలి. ఈ మధ్య మెట్రో స్టేషన్ ఏరియాలను ప్రిఫర్ చేస్తున్నారు. బస్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలైతే ఇంకా బెటర్. ఒకవేళ ఉండేందుకు కాదు… పెట్టుబడి కోసం తీసుకోవాలన్నా సరే ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అప్పుడే.. పెట్టిన పెట్టుబడికి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయి. 

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

×