EPAPER

Mutual Funds :- మ్యూచువల్ ఫండ్‌ని ఎమర్జెన్సీ ఫండ్‌గా వాడుకోవచ్చా?

Mutual Funds :- మ్యూచువల్ ఫండ్‌ని ఎమర్జెన్సీ ఫండ్‌గా వాడుకోవచ్చా?


Mutual Funds:- మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి లాభాలు రావాలంటే కనీసం మూడేళ్లు వెయిట్ చేయాలి. ఇది ప్రైమరీ రూల్. కనీసం 12 శాతం రిటర్న్స్ రావాలంటే ఆ మాత్రం వెయిట్ చేయక తప్పదు. 7-8 శాతం లేదా 9 శాతం వడ్డీ కావాలనుకున్నప్పుడు పోస్టాఫీస్, బ్యాంక్ ఫిక్డ్స్ డిపాజిట్లలో చేస్తే సరిపోతుంది. కాని, అంతకు మించి రాబడి రావాలనుకుంటే మాత్రం.. కచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్‌లలో మూడేళ్లు ఉండాలి. అలాగని ముందుగా తీసేసుకోకూడదా అంటే తీసుకోవచ్చు. కాకపోతే, ట్యాక్స్ పడుతుంది. కొందరికి అత్యవసరంగా డబ్బు అవసరం వస్తుంటుంది. అలాంటి వారి ప్రత్యేక మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయా అంటే.. ఉన్నాయనే చెప్పాలి.

లిక్విడ్‌ ఫండ్స్‌, అల్ట్రా-షార్ట్‌ డ్యూరేషన్‌ మ్యూచువల్‌ పండ్లు వంటి షార్ట్ టర్మ్ డెట్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. వీటిలో చాలా తక్కువ రిస్క్‌ ఉంటుంది. పైగా అత్యవసర పరిస్థితుల్లో త్వరగా డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి వీలు కూడా ఉంటుంది. నెల జీతం మీద ఆధారపడి సేవింగ్స్ చేసుకుంటున్న వారికి ఈ పథకాలు అనుకూలంగా ఉంటాయి. కాకపోతే.. అంత పెద్ద రిటర్న్స్ రావు.


ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉండాలి. రిస్క్ తీసుకోగలిగితే ఇంకా బెటర్. ఎంత రిస్క్ తీసుకుంటే అంత రిటర్న్స్ వస్తాయి. కాకోపోతే, వయసును దృష్టిలో పెట్టుకుని ఈ రిస్క్ తీసుకోవాలి. రిటైర్మెంట్ దగ్గరపడుతున్న వాళ్లు అస్సలు రిస్క్ తీసుకోవద్దు. ఇంకా బాధ్యతలు మీద పడని వాళ్లు, జాబ్‌లో సెటిల్ అయిన వాళ్లు కొంత రిస్క్ తీసుకోవచ్చు. ఇంకా వీలైతే.. కంపెనీలు అప్పుడప్పుడు ఇచ్చే బోనస్, ఇన్వెంటివ్స్‌ను కూడా పెట్టుబడిగా పెడితే ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయి. ఎలాగూ మ్యూచువల్ ఫండ్స్‌లోనే పెడుతున్నారు కాబట్టి.. అంత పెద్ద రిస్క్స్ ఉండకపోవచ్చు.

మూడేళ్ల పిరియడ్ కూడా షార్ట్ టర్మ్ కిందే లెక్క. అందుకే, చిన్న వయసులో ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్స్ వేసుకోవాలి. సరే.. చిన్న చిన్నగా ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ కింద నెలకు 2వేల రూపాయలు పెడుతూపోతే.. ఓ 20 ఏళ్లకి 20 లక్షలు సంపాదించొచ్చు. యావరేజ్‌గా 12 శాతం చొప్పున లెక్కేస్తే ఈ 20 లక్షలు చేతికొస్తాయి. ఒక్కోసారి ఎక్కువ పర్సంటేజ్ కూడా రావొచ్చు. ఇక రిస్క్‌ ఉన్నా ఫర్వాలేదు ఎక్కువ రాబడి రావాలనుకునే వాళ్లు.. కాస్త ధైర్యం చేసి స్మాల్‌, మిడ్‌-క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. రిస్క్ వద్దు అనుకుంటే.. లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోచవచ్ు. 

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

×