Copper Ring :- మనకి భూమి మీద లభించే లోహాల్లో చవకైనది, అనుకూలమైంది రాగి. ఈ లోహాంతో చేసే ఆభరణాలు ధరించేవారు ఉంటారు. నార్త్ సైడ్ రాగి ఉంగరాలు, కడియాలు ధరించే వారు ఎక్కువగా కనిపిస్తారు. జాతకంలో సూర్యుడు, కుజుడు అనుకూల స్థితిలో లేనప్పుడు రాగి ఉంగరం పెట్టుకోచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కాపర్ రింగ్ వల్ల చెడు ప్రభావం నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ లోహంతో చేసిన ఉంగరాలు మనిషిలోని చెడు ఆలోచనలను తప్పించి పాజిటివ్ థింకింగ్ ను కలిగిస్తుంది. రాగి ఉంగరం ధరించడం వ్యక్తిత్వ వికాసానికి మేలు చేస్తుంది. రాగి ఉంగరంతో సూర్య సంబంధించి రోగాలు కూడా నయమవుతాయి. విజ్ఞాన శాస్త్రం పరంగా రాగి ఎంతో స్వచ్ఛమైంది. రాగితో తయారు చేసిన పాత్రలు శరీరారానికి మేలు చేస్తాయి. పైగా తక్కువ ధరకే దొరకడం వల్ల అన్ని తరగతుల ప్రజలు వాడచ్చు.
రాగి రింగ్ తో మంచి జరుగుతుందని చెబుతారు. మగవారు కుడిచేతి ఉంగరపు వేలికి, మహిళలైతే ఎడమచేతి ఉంగరపు వేలికి ధరించాలి. దీని వల్ల ఒంట్లోని రక్తాన్ని శుద్ధి అవుతుంది. వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. శరీరంలోని మలినాలను తొలగించి ఇమ్యూనిటిని పెంచడానికి సహాయపడుతుంది. రాగి ఉంగరం ధరించడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే రాగి శరీరంలోని రక్తపోటును బ్యాలెన్స్ చేస్తుంది. ఆ రకంగా గుండె ఆరోగ్యంగా ఉండేలా మంచి చేస్తుంది. కీళ్ల సమస్యల నివారణకు రాగి ఆభరణాలు ఉపయోగపడతాయి. అలాగే ఎముకల వికాసానికి తద్వారా ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది.
రాగి ఆభరణాలు పెట్టుకోవడం ఒంటికి చాలా మంచిది. చర్మకాంతిని పెంచడమే కాదు చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. అందువల్ల నిత్య యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. చేతులు, వేళ్లు, పాదాల్లో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.