Zoonomia Project : అసలు మనిషి జీవనం అనేది ఎక్కడ మొదలయ్యింది, జీవనం మొదలయినప్పుడు మనిషి ఎలా ఉండేవాడు, అప్పటినుండి ఇప్పటివరకు జరిగిన మార్పులకు కారణాలు ఏంటి, ఇలా ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ శాస్త్రవేత్తలు సమాధానాలు వెతికే ప్రయత్నంలోనే ఉన్నారు. మనుషులు మాత్రమే కాదు.. దాదాపు ప్రతీ జంతువు జీవనం అనేది ఎలా మొదలయ్యింది అని కనుక్కోవడానికి కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసమే వారు ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
దాదాపు 100 మిలియన్ సంవత్సరాల నుండి జంతువుల్లో జాతులు ఎలా మారుతూ వచ్చాయి, వాటి జీన్స్‌లో జరిగిన మార్పులు ఏంటి అని తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. దానిపేరే జూనోమియా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మనుషుల్లో మాత్రమే కాకుండా జంతువుల్లో ఉండే జినోమ్‌లోని మార్పులు గమనిస్తూ, అసలు వ్యాధుల సమయంలో ఎలాంటి మార్పులు వస్తాయి అని తెలుసుకుంటూ ముందుకెళ్తారు.
ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ పరంగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో హైబర్నేషన్ జెనటిక్స్ అనేవి కీ రోల్ ప్లే చేశాయి. దీని ద్వారానే మనుషులు అసలు ఎందుకు అస్వస్థకు గురవుతారు, అలాంటి సమయంలో వారిలో వచ్చే మార్పులు ఏంటి అని తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనుషుల్లో మెదడుకు సంబంధించిన వ్యాధులకు కూడా కారణమయ్యే జెనటిక్స్‌ను ఈ ప్రాజెక్ట్‌లో కనుక్కోవచ్చని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కలిగిన బయోడైవర్సిటీ అనేది మనుషుల గురించి మరింత క్షుణ్ణంగా స్టడీ చేయడానికి సహాయపడుతుందని తెలిపారు.
మనిషి జెనోమ్ గురించి 20 ఏళ్ల క్రితమే స్టడీ మొదలయినా కూడా ఇప్పటికీ దీని గురించి పూర్తిగా సమాచారం శాస్త్రవేత్తల వద్ద లేదని బయటపెట్టారు. మనిషి జెనోమ్ అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుందని అన్నారు. మనిషి జెనోమ్ ఇతర జంతువుల జెనోమ్ కంటే భిన్నంగా ఉంటుందని, అందుకే దానిని స్టడీ చేయడం కష్టమని తెలిపారు. కానీ ఇప్పటివరకు చేసిన పరిశోధనల్లో మాత్రం మనిషి పుట్టింది కోతి నుండే అని చెప్పే విధంగా న్యూరోలాజికల్ జీన్స్ వారికి కనిపించాయని చెప్పారు శాస్త్రవేత్తలు.