EPAPER
Kirrak Couples Episode 1

Rajinikanth: అప్పట్లోనే ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంతంటే.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజినీకాంత్..

Rajinikanth: అప్పట్లోనే ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంతంటే.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజినీకాంత్..

Rajinikanth Latest News: ఎన్టీఆరే తనకు రోల్ మోడల్ అన్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఆయన వల్లే తాను సినిమాల్లోకి వచ్చానన్నారు. వచ్చాక నటనలో ఎన్టీఆర్‌నే అనుకరించానని చెప్పారు. ఎన్టీఆర్‌ ఆ రోజుల్లోనే 10 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునేవారని.. అది వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి రాణించారని అన్నారు. ఎన్టీఆర్‌కు స్పీడ్ ఎక్కువని.. ఆయన సీఎం అయినప్పుడు తాను ఎగిరి గంతేశానని చెప్పుకొచ్చారు. ఇంకా అనేక విషయాలు గుర్తు చేసుకున్నారు రజినీకాంత్…


తాను చూసిన ఫస్ట్ మూవీ పాతాళభైరవి అని చెప్పారు. అప్పట్లో భైరవి విగ్రహ రూపం తన మైండ్‌లో చాన్నాళ్ల పాటు ఫిక్స్ అయిపోయిందని అన్నారు. తన ఫస్ట్ మూవీలో ఫస్ట్ డైలాగ్ కూడా భైరవి పేరుతోనే ఉంటుందని.. “భైరవి ఇల్లు ఇదేనా?” అనేది తాను చెప్పిన మొదటి డైలాగ్ అన్నారు. మొదట్లో తాను విలన్‌గా చేసేవాడినని.. హీరోగా తాను నటించిన తొలిసినిమా “భైరవి” అని చెప్పారు. భైరవి పేరు ఉందనే తాను హీరోగా చేసేందుకు ఒప్పుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ అంతలా తనపై ప్రభావం చూపారర్నారు.

‘లవకుశ’ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో బెంగళూరులో తాను ఎన్టీఆర్‌ను తొలిసారి చూశానని.. అప్పుడు తనకు 13 ఏళ్లు ఉంటాయన్నారు. పంచె, సిల్క్ షర్ట్, కూలింగ్ గ్లాసెస్‌తో ఉన్న ఎన్టీఆర్‌ను చూసి ఆశ్చర్యపోయానన్నారు.


శ్రీకృష్ణపాండవీయంలో దుర్యోదనుడిగా ఎన్టీఆర్ నటన తనను మంత్రముగ్థున్ని చేసిందని చెప్పారు. తాను ఆ దుర్యోదన క్యారెక్టర్‌ డైలాగ్ చెబితే.. అది చూసి తన ఫ్రెండ్స్ అంతా తనను సినిమాల్లో నటించమని యంకరేజ్ చేశారని.. ఆ విధంగా కూడా ఎన్టీఆర్ వల్లే సినిమాల్లోకి వచ్చినట్టు అవుతుందని అన్నారు.

ఎన్టీఆర్‌తో కలిసి టైగర్ మూవీలో తొలిసారి యాక్ట్ చేశానని.. అప్పట్టో బ్యాడ్ హాబిట్స్ ఉండటం వల్ల.. తనను హీరోగా బుక్ చేసుకున్నవాళ్లు ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకునే వారని చెప్పారు. కానీ, అందరూ వద్దన్నా ఎన్టీఆర్ మాత్రం ఏమవుతుంది తీసుకోండి అన్నారని.. దాంతో టైగర్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని.. అప్పటి నుంచీ మళ్లీ తనకు అవకాశాలు క్యూ కట్టాయని గతాన్ని నెమరువేసుకున్నారు.

రజనీకాంత్ అంటే స్పీడ్.. స్పీడ్ అంటే రజనీకాంత్.. అనేవారిని కానీ ఎన్టీఆర్‌కు తనకంటే స్పీడ్ ఎక్కువని ఓ షూటింగ్ సన్నివేశం గురించి చెప్పారు. ఎన్టీఆర్ ఉదయం 7 గంటలకే మేకప్ తో షూటింగ్ కి వచ్చేవారని.. అది ఆయన సినిమాకు ఇచ్చే మర్యాద అని అన్నారు.

దాన వీర శూర కర్ణ.. చూసి తాను ఆశ్చర్యపోయనని.. అదే దుర్యోదన క్యారెక్టర్‌ను తాను తమిళ్‌లో చేద్దామని అనుకుని.. మేకప్ వేసుకుని ఫోటోలు దిగానని చెప్పారు. అయితే, ఆ ఫోటోలు చూసి తన స్నేహితుడు కోతిలా ఉన్నావ్.. వద్దంటే వద్దు అనడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నానని.. ఎన్టీఆర్‌లా మరెవరూ దుర్యోదనుడి రోల్ చేయలేరని ప్రశంసించారు రజినీకాంత్.

రాజకీయాల్లోనే కాదు.. సినిమాల్లోనూ ఎన్టీఆర్ కింగ్ అన్నారు. తాను జీవితంలో రెండే రెండు సందర్భాల్లో ఎగిరి గంతేశానని..
1983లో ఎన్టీఆర్ గెలిచినప్పుడు మొదటిసారి జంప్ చేశానని.. ఆ విజయం ‘న భూతో న భవిష్యతి’అంటూ గొప్పగా చెప్పారు రజినీ. మరోసారి హిమాలయాల్లో గంగానదిని చూసి ఎగిరి గంతేశానని గుర్తు చేసుకున్నారు.

40 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్‌కు 10 లక్షలు రెమ్యూనరేషన్ ఉందేదని.. అదంతా వదిలేసి.. జనాల కోసం రోడ్ల మీదకు వచ్చారని.. చివరి వరకూ ప్రజల కోసమే పాకులాడారని కొనియాడారు. రామోజీరావు లేకుంటే తాను గెలిచేవాడినే కాదని.. ఆయన ఎంతో సపోర్ట్ చేశారని.. రామోజీకి తాను రుణపడి ఉంటానని ఎన్టీఆర్ ఎప్పుడూ చెబుతుండేవారని రజినీకాంత్ అన్నారు.

Related News

Pawan Kalyan Varahi Sabha : రేపటి వారాహి సభలో పవన్ ఏం చెప్పనున్నారు ? అందరిలోనూ ఒకటే ఉత్కంఠ

Trivikram Srinivas: టీటీడీ బోర్టులోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్?

Home Minister: వడ్డీ వ్యాపారులకు షాకింగ్ న్యూస్.. ఇక నుంచి మీరు…

Cm Chandrababu: ఏపీ ప్రజలకు చంద్రబాబు గుడ్ న్యూస్.. ఆ పన్ను నుంచి పూర్తిగా ఉపశమనం

CM Chandrababu: 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్.. 2017 నాటికి ప్రతి ఇంటికి మంచి నీళ్లు: సీఎం చంద్రబాబు

RK Roja: బావ కళ్లల్లో ఆనందం కోసం.. పురందేశ్వరిపై రోజా గరంగరం!

YS Sharmila: దీక్షలో వైఎస్ షర్మిల.. ప్లీజ్ రాజకీయాలొద్దు, టీడీపీ, వైసీపీ, జనసేనకు రిక్వెస్ట్..

Big Stories

×