EPAPER
Kirrak Couples Episode 1

Lime Wash :- ఇంటికి సున్నం వేయకుండా పెళ్లిళ్లి చేయకూడదా…

Lime Wash :- ఇంటికి సున్నం వేయకుండా పెళ్లిళ్లి చేయకూడదా…


Lime Wash :- పూర్వం రోజుల్లో ఇంటికి సున్నం మాత్రమే వేయించే వారు. ఇంట్లో శుభకార్యం జరగాలంటే ముందు గోడలకి వైట్ సున్నం వేయించిన తర్వాతే పనులు మొదలుపెట్టే వారు. గృహ ప్రవేశ సమయంలో కూడా ఇంటికి సున్నం వేయకుండా అడుగు కూడా పెట్టే వారు. సున్నం వేయని ఇంట్లో గృహ ప్రవేశం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. ఇటుకల ఇంటికైనా, మట్టి ఇంటి కైనా, రాతి కట్టడానికైనా బట్టీ సున్నం వేయడం ఎంతో మంచిది. శుభకార్యాల సమయంలో ఇంటికి వెల్ల వేయడం శుభ ప్రదం, ఆరోగ్య ప్రదం.


శుభకార్యాలయ సమయంలో సున్నం వేయడం వల్ల ఇంటికి కొత్త కళ వస్తుంది. పాత ఇల్లు అయినా కొత్త లుక్ వస్తుంది. ఇంట్లో ఉండే మనుషుల్లో ఉత్సాహం పెరుగుతుంది. సంతోషంగా పని చేయడం వల్ల ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు. ఇంటి రంగులు యజమానిపై ప్రభావం చూపిస్తుంటాయి. జాతక రిత్యా తెలుపు రంగు సరిపోని వారు ఇతర రంగులు ఇంటికి వేయించుకోవచ్చు.

ఇంటి లోపల బయట క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం సున్నం వేయడం వల్ల వేసవి ఎండల తీవ్రత నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే శీతాకాలంలో అతి చల్లదనాన్ని కూడా సున్నం లోనికి రానీయదు. సున్నం వేయడం వల్ల గదులలో ప్రశాంతవంతమైన కాంతి రెట్టింపు అవుతుంది. అలాగే హాని కారక క్రిములు, కీటకాలు ఇంట్లోకి రావు. సున్నం వేసిన ఇంట్లో లక్ష్మి, సరస్వతులు ఇద్దరూ ఉంటారని నానుడి. ఆ ఇంట్లో నివసించే వారంతా ప్రశాంత జీవితం గడుపుతారు. అభివృద్ది కలుగుతుంది.అయితే ఇవాళ్టి రోజుల్లో ఇంటికి సున్నం లాంటివి వేయడం మానేశారు. వాస్తవానికి మార్కెట్లో సున్నం కూడా లభించడం లేదు. సాధారణ రంగులతోనే పనిచేయించుకుంటున్నారు. ఇంట్లో వివాహాలు, ఉపనయనం వంటి శుభ కార్యక్రమాలు తలపెట్టినప్పుడు సున్నం తప్పని సరిగా వేయాలి. అలాగే ఆ ఇంట్లో మన ఆప్తుల మరణం సంభవించి సంవత్సరం పూర్తి అయినప్పుడు… సున్నం తప్పనిసరిగా వేయాలి.

మనిషికి చర్మం లాంటి ఇంటికి సున్నం. గతంలో సిమెంట్ రాక ముందు సున్నంతో గృహ నిర్మాణాలు జరిగేవి. దేవాలయాలు, పెద్ద పెద్ద కట్టడాలు అన్నీ సున్నంతోనే నిర్మించినవే. తాజ్ మహల్,కుతుబ్ మీనార్, చార్మినార్, శ్రీరంగ నాధ దేవాలయం, కాశి విశ్వేశ్వరాలయం మొదలైన చారిత్రిక కట్టడాలన్నీ సున్నం తోనే నిర్మించారు. సున్నానికి ఉన్న లైఫ్ టైంలో ఐదో వంతు మాత్రమే సిమెంట్ కి ఉంటుంది.

Tags

Related News

Horoscope 2 october 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయాన్ని మించిన ఖర్చులు!

Engilipoola Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ వచ్చేసింది, పువ్వులు ఎలా ఎంగిలి అవుతాయో తెలుసుకోండి

Navaratri 2024: నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సుల కోసం ఏ రంగు దుస్తులు ధరించాలొ తెలుసా ?

Lucky Zodiac Signs: అక్టోబర్‌లో వీరు పట్టిందల్లా బంగారమే !

Horoscope 1 october 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయం పదింతలు!

Surya Grahan 2024 : పితృ అమావాస్య నాడు సూర్య గ్రహణం రానుంది.. ఈ వస్తువులు దానం చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి

Shardiya Navratri 2024 : శ్రీ రాముడు కూడా శారదీయ నవరాత్రి ఉపవాసం చేసాడని మీకు తెలుసా ?

Big Stories

×