EPAPER

KCR: ‘పైసా వసూల్’ ఎమ్మెల్యేలకు వార్నింగ్.. మరి, ఇన్నాళ్లూ ఏం చేశారు కేసీఆర్?

KCR: ‘పైసా వసూల్’ ఎమ్మెల్యేలకు వార్నింగ్.. మరి, ఇన్నాళ్లూ ఏం చేశారు కేసీఆర్?

KCR: దళిత బంధు. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం. ఒక్కొక్కరికి 10 లక్షల ఆర్థిక సాయం అంటే మాటలా. ఆ దళిత కుటుంబాల తలరాత మార్చేస్తామంటోంది సర్కారు. ఎంతో ప్రెస్టీజియస్‌గా చేపట్టిన ఈ పథకంలోనూ కాసులకు కక్కుర్తి పడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దళితబంధు లబ్దిదారుల ఎంపికంతా.. ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణ ఉంది. కొందరు ఎమ్మెల్యేలు లబ్దిదారుల నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. ఈ విషయం పలుమార్లు మీడియాలో కథనాలుగా వచ్చాయి. విపక్ష పార్టీలు సైతం విమర్శలు గుప్పించాయి. లేటెస్ట్‌గా సీఎం కేసీఆర్ సైతం ఇదే విమర్శ చెప్పడం కలకలం రేపుతోంది.


“దళితబంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గర ఉంది. ఆ ఎమ్మెల్యేలకు ఇదే చివరి వార్నింగ్‌. ఇంకోసారి తప్పు చేస్తే పార్టీ నుంచి తప్పిస్తాం. కొందరు ఎమ్మెల్యేలు దళితబంధు కమిషన్‌గా 2-3 లక్షలు వసూలు చేస్తున్నారు. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యత. రెండు పడక గదుల ఇళ్ల విషయంలోనూ ఆరోపణలు ఉన్నాయి”.. ఇవీ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.

ఇవేమైనా మామూలు మాటలా. సొంతపార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వ పథక లబ్దిదారుల నుంచి పైసా వసూల్ చేస్తున్నారంటే చిన్న విషయమా? అసలే దళితబంధు అతికొద్ది మందికి మాత్రమే ఇస్తున్నారు. అందులోనూ ఎమ్మెల్యే అనుచరులు, పార్టీ కార్యకర్తలనే లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నారు. దీనిపైనే విమర్శలు వస్తుంటే.. ఇక వారి నుంచి కమిషన్లు తీసుకుంటున్నారంటే ఏమనాలి?


అటు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కోసం అనేక మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. కొన్నిచోట్ల పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు కట్టినా.. వాటిని పంచకుండా షో పీస్‌లా ఖాళీగానే ఉంచారు. అనేక చోట్ల హామీలైతే ఇచ్చారు కానీ.. అసలు నిర్మాణాలే చేపట్టలే. ఇక, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇచ్చిన చోట స్థానిక ఎమ్మెల్యేలు అందిన కాడికి దండుకుంటుండటం దారుణం. ఈ విషయం సాక్షాత్ సీఎం చెప్పారంటే ఈ దందా ఏ రేంజ్‌లో సాగుతుందో తెలుస్తోంది. మరి, ఈ విషయం తెలిసి కూడా ఇన్నాళ్లూ సీఎం కేసీఆర్ ఏం చేసినట్టు? వారిని ఎందుకు కట్టడి చేయలేదు? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. ఇన్నాళ్లూ తీసుకున్నది చాలు ఇకపై వద్దు.. అనే మెసేజ్ ఇస్తున్నారా? అవినీతి రహిత పాలన అంటే.. అవినీతిని దాచి పెట్టి ఉంచడమేనా? ఎమ్మెల్యేల తోకలు కట్ చేస్తానని కూడా అన్నారు కేసీఆర్. అనడం ఎందుకు ఆ తోకలు, కొమ్ములు అన్నీ కట్ చేసి.. మాటల సీఎం కాదు చేతల సీఎం అని నిరూపించుకోవచ్చుగా.. అని చర్చించుకుంటున్నారు ప్రజలు.

Related News

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

Big Stories

×