EPAPER

Save The Tigers : సేవ్ ది టైగ‌ర్స్‌ వెబ్ సిరీస్ రివ్యూ

Save The Tigers : సేవ్ ది టైగ‌ర్స్‌ వెబ్ సిరీస్ రివ్యూ

Save The Tigers : మారుతున్న ట్రెండ్‌ను ఫాలోఅవుతున్న మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చెప్పాల‌నుకుని చెప్ప‌లేక పోతున్న కాన్సెప్ట్‌ల‌తో వెబ్ మూవీస్‌, వెబ్ సిరీస్‌లు రూపొందిస్తున్నారు. ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటున్నారు. ఆ కోవ‌లో యాత్ర‌, ఆనందో బ్ర‌హ్మ చిత్రాల ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్ షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ రూపొందించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగ‌ర్స్‌. త‌మ‌ని తాము పులులుగా అభివ‌ర్ణించుకునే మ‌గ‌వాళ్లు పెళ్లి త‌ర్వాత ఎలాంటి ఇబ్బందులు ప‌డుతున్నార‌నే కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిగా వెబ్ సిరీస్ రూపంలో ఆవిష్క‌రించారు. అది కూడా ఎంటైర్‌టైన్మెంట్ యాంగిల్‌లో ఉండ‌టంతో ఈ వెబ్ సిరీస్‌పై క్యూరియాసిటీ పెరిగింది. మ‌రి నిజంగానే ఈ వెబ్ సిరీస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుందా లేదా? అనే విష‌యం తెలుసుకోవాలంటే క‌థేంటో చూద్దాం..


క‌థ‌:
గంటా ర‌వి (ప్రియ‌ద‌ర్శి) పాల‌మ్ముకుంటుంటాడు. ఆయ‌న భార్య హైమ‌(జోర్దార్ సుజాత‌) పార్ల‌ర్ ర‌న్ చేస్తుంటుంది. రాహుల్ (అభిన‌వ్ గోమ‌టం) రైట‌ర్ కావాల‌ని సాఫ్ట్ వేర్ జాబ్ మానేసి ట్ర‌య‌ల్స్ లో ఉంటాడు. అత‌ని భార్య మాధురి (పావ‌ని గంగిరెడ్డి) డాక్ట‌ర్‌. విక్ర‌మ్ (చైత‌న్య‌కృష్ణ‌) యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ డైర‌క్ట‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు.అత‌ని భార్య రేఖ (దేవ‌యాని) లాయ‌ర్‌. భార్య‌లు పెట్టే ఇబ్బందులు త‌ట్టుకోలేక ముగ్గురూ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. ఓ చోట క‌లుసుకున్న ర‌వి, రాహుల్‌, విక్ర‌మ్ ఫ్రెండ్స్ అవుతారు.


వీళ్లు ముగ్గురు స‌ర‌దాగా తాగేసి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డ‌తారు. అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డి ఇంటికి వెళ్తుంటే, హంస‌లేఖ అనే హీరోయిన్ కిడ్నాప్ కేసులో వీళ్ల‌ను మ‌ళ్లీ పోలీసులు అరెస్ట్ చేస్తారు. అస‌లు హీరోయిన్‌తో వీళ్ల‌కు సంబంధం ఉందా? లేకుంటే వీళ్ల‌ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక‌వేళ ఉంటే అది ఏంటి? ఈ ముగ్గురికి అంత‌కు ముందే ప‌రిచ‌యం ఉందా? నేరం వీళ్లే చేశారా? చేయ‌క‌పోతే ఆ నింద నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు. అస‌లే వీళ్ల చేష్ట‌ల‌కు విసిగిపోయి తిట్టే భార్య‌లు స‌పోర్ట్ చేశారా? లాయ‌ర్ రేఖ త‌న‌వంతు కృషి చేసి వీళ్ల‌ను బ‌య‌ట‌కు తీసుకుని వ‌చ్చిందా? పార్ల‌ర్ ర‌న్ చేసే హైమ‌, డాక్ట‌ర్ మాధురి ఏం చేశారు? అనేది ఆస‌క్తిక‌రం.

స‌మీక్ష‌:

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఉండే అల‌క‌లు, గొడ‌వ‌లు ఒక‌రిపై ఒక‌రు పంచ్‌లు విసురుకోవ‌టం, స‌ర‌దాగా ఆట ప‌ట్టించటం, సీరియ‌స్‌గా గొడ‌వ పడ‌టం .. ఇలాంటి కాన్సెప్ట్‌ల‌పై ప‌లు సినిమాలు, సిరీస్‌ల‌ను మ‌నం చూసుండొచ్చు. అయితే ఇదే పాయింట్‌ను పూర్తి స్థాయి వినోదాత్మ‌కంగా తెర‌కెక్కిస్తూ చేసిన ప్ర‌య‌త్న‌మే ‘సేవ్ ది టైగర్స్’. ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్ త‌న ద‌గ్గ‌రున్న పాయింట్‌ను డెవ‌ల‌ప్ చేసి షో రన్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించి ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. యాక్ట‌ర్ తేజ కాకుమాను దీంతో ద‌ర్శ‌కుడిగా మారారు. ముగ్గురు భ‌ర్త‌లు డ్రండ్ డ్రైవ్ కేసులో దొరికి సీఐని క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకోవ‌టంతో సిరీస్‌ను స్టార్ట్ అవుతుంది. ఆ సీఐ కూడా భార్య బాధితుడే కావ‌టంతో అత‌ను వీరి బాధ‌ల‌ను విన‌టం స్టార్ట్ చేస్తాడు. అక్క‌డ నుంచి ఒక్కొక్క‌రుగా త‌మ జీవితాల‌ను చెప్ప‌టం.. అందులో తాము భార్య‌ల‌తో ప‌డుతున్న ఇబ్బందుల‌ను చెప్ప‌టం అనేది సీన్ బై సీన్ ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు.

చైత‌న్య కృష్ణ, దేవ‌యాని జంటకు సంబంధించిన అంశం సీరియ‌స్‌గా సాగుతుంటుంది. ఓ వైపు భార్య‌, మ‌రో వైపు బాస్ నుంచి వ‌చ్చే టెన్ష‌న్‌ను భ‌రించే వ్య‌క్తిగా చైత‌న్య‌, లాయ‌ర్ అయిన దేవ‌యాని ఏదైనా తానే క‌రెక్ట్ అనే కోణంలో చూస్తూ క‌నీసం భ‌ర్త చెప్పే మాట‌ల‌ను విన‌దు. మ‌రో వైపు బ‌స్తీలో ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని జోర్దార్ సుజాత.. ప్రియ‌ద‌ర్శిని గేటెడ్ క‌మ్యూనిటికి వెళ్లిపోదామ‌ని స‌తాయిస్తుంటుంది. తెలంగాణ యాస‌లో ప్రియ‌ద‌ర్శి చెప్పిన డైలాగ్స్‌, చేసిన న‌టు సింప్లీ సూప‌ర్బ్‌. ఇక జోర్దార్ సుజాత త‌న రోల్‌ను అంతే రేంజ్‌లో చేసింది. ఇక అభిన‌వ్ గోమ‌టం కూడా త‌న‌దైన డైలాగ్ డెలివ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. రైట‌ర్ కావాల‌కుని ఇంట్లోనే ఉంటూ .. సినిమాలు, టీవీలు చూస్తుండ‌టం, ప‌ని మనిషితో స‌ర‌దాగా ఉండ‌టం వంటి స‌న్నివేశాల్లో అభిన‌వ్ గోమ‌టం చ‌క్క‌గా న‌టించాడు. ఇక గంగ‌వ్వ‌, బాస్ రోల్ చేసిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఇలా అంద‌రూ వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సాంకేతికంగా చూస్తూ మ‌హి వి.రాఘ‌వ్‌, ప్ర‌దీప్ అద్వైతం రాసిన కాన్సెప్ట్‌ను న‌టుడు తేజ కాకుమాను ద‌ర్శ‌కుడిగా చ‌క్క‌గా ఎలివేట్ చేసుకుంటూ వ‌చ్చావ‌డు. రెండు, మూడు స‌న్నివేశాలు మిన‌హా సిరీస్ అంతా స‌ర‌దాగా సాగిపోయింది. డైలాగ్స్ అక్క‌డ‌క్క‌డా ద్వంద్వార్థాలు తార‌స ప‌డినా.. స‌ద‌ర్భానుసారం అవి ఓకే అనిపిస్తాయి. అజ‌య్ నేప‌థ్య సంగీతం, విశ్వేశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ బావున్నాయి. సిరీస్ సెకండ్ సీజ‌న్ ఉంటుంద‌ని చెప్పే ట్విస్టుతో ముగించ‌టం కొస మెరు.. ఆక‌ట్టుకుంటుంది.

చివ‌ర‌గా.. కామెడీని పంచే ‘సేవ్ ది టైగర్స్’

రేటింగ్: 3/5

వెబ్ సిరీస్ : సేవ్ ది టైగ‌ర్స్‌
స్ట్రీమింగ్‌: హాట్ స్టార్‌
ద‌ర్వ‌క‌త్వం: తేజ కాకుమాను
నిర్మాత‌లు: మ‌హి వి.రాఘ‌వ్‌, చిన్నా వాసుదేవ రెడ్డి
న‌టీన‌టులు: ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌టం, చైత‌న్య కృష్ణ‌, జోర్దార్ సుజాత‌, పావ‌ని, దేవ‌యాని, గంగ‌వ్వ, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్, టిల్లు వేణు, రోహిణి త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వ‌ర్‌
సంగీతం: అజ‌య్ అర్స‌ద
ఎడిటింగ్‌: శ్ర‌వ‌ణ్

Related News

Allu Arjun : ఆ సినిమా నుంచి హీరోయిన్ తప్పుకుంది… తర్వాత బన్నీ బతిమలాడి తీసుకొచ్చాడు.

NTR: చచ్చిపోతానేమో అనుకున్నా.. ఛీఛీ.. నా మీద నాకే చిరాకేసింది..

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Actress : యాడ్ షూట్ లో డర్టీ పనులు… స్టార్ హీరో అసభ్యకరంగా తాకాడంటూ హీరోయిన్ ఆరోపణలు

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Sobhita Dhulipala: అక్కినేని కోడలా.. మజాకానా.. ఎమ్మీ అవార్డ్స్ కు శోభితా బోల్డ్ సిరీస్

Chiranjeevi : పక్కొడి పనిలో వేలు పెడుతారు… చాలా కాన్ఫిడెంట్‌గా చిరుకి కౌంటర్

Big Stories

×