EPAPER

Hindu Marriage Custom :- జీలకర్ర-బెల్లంతో ఎవరిది పై చేయి తేలిపోతుందా…

Hindu Marriage Custom :- జీలకర్ర-బెల్లంతో ఎవరిది పై చేయి తేలిపోతుందా…

Hindu Marriage Custom :- హిందూధర్మశాస్త్రం ప్రకారం పెళ్లిళ్లల్లో వధూవరులతో జీలకర్ర , బెల్లం తలపై పెట్టిస్తుంటారు. తాళి ముహూర్తం కన్నా జీలకర్ర, బెల్లం పెట్టే ముహూర్తమే అసలైనదిగా భావిస్తుంటారు.అలాంటి కీలక ఘట్టంలో తలపై ఎవరు ముందుగా జీలకర్ర, బెల్లం పెడతారో వారిదే పైచేయి అవుతుందన్న మాట ప్రచారంలో ఉంది. కానీ సరికాదని పండితులు చెబుతున్నారు. సాంప్రదాయంగా అయితే పెళ్లి కూతురితోనే ముందుగా జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఆ తర్వాతే వరుడు పెట్టాల్సి ఉంటుంది.


పూర్వజన్మ కర్మలు, జాతకాలు బట్టి పెళ్లిళ్లు జరుగుతుంటాయి. కాబట్టి ముందుగా అమ్మాయి జీలకర్ర, బెల్లం పెడితే ఆమె మాట చెల్లుబాటు అవుతుందని అనుకోకూడదు. అలాగే అబ్బాయికి ఇదే సూత్రం వర్తిస్తుంది. వాస్తవానికి జీలకర్ర, బెల్లం పెట్టడం అనేది పండితులను నిర్ణయించి సుమూహర్తం మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి.

అన్నీ సవ్యంగా ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. హిందూ ధర్మ ప్రకారం పూర్వ జన్మలో చేసిన మంచి , చెడ్డలను బట్టి మంచి భర్త, మంచి భార్య దక్కుతారని నమ్మకం ఉంది. కర్మను ఎవరూ తప్పించలేరు. జీలకర్ర, బెల్లం సక్రమంగా పెడితే దాంపత్యం విడిపోకుండా కలిసి ఉంటుంది.


శాస్త్రీయంగా అయితే మనుష్యుల శరీరంలో ఒక జీవశక్తి ఉంటుంది . పెళ్లిల్లో ముందుగా జీలకర్ర, బెల్లం తలపై పెడతారో వారిశక్తి అవతల శక్తిపై పడుతుంది అంతే. ఆ ఆ ప్రవాహశక్తి జీవితాంతము పని చేస్తుంది. అందుకే కొంతమంది ఇంట ముందుగా జీలకర్ర, బెల్లం పెట్టిన వారిమాటే చెల్లుబాటు అవుతుంది. జీలకర్ర బెల్లంలోఒక పవర్ ఫుల్ శక్తి ఉంది.

వీటి వల్ల వధూవరులు పరస్పర జీవశక్తులు పరస్పరం ఆకర్షితం అవుతాయి. అరచేతితో ఈ మిశ్రమాన్ని తలపై పెట్టినప్పుడు శక్తీ ఇరువురి బ్రహ్మరంద్రాలలోకి ప్రవేశించి సహస్రార చక్రం ద్వారా ఆకర్షణ శక్తిని కలిగిస్తుంది. అందుకే జీలకర్ర సర్వ మంగళకరంగా భావిస్తారు.

Related News

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Big Stories

×