EPAPER
Kirrak Couples Episode 1

Mudra Loan:- ముద్ర లోన్స్‌ కావాలా.. ఇలా అప్లై చేసుకోవచ్చు

Mudra Loan:- ముద్ర లోన్స్‌ కావాలా.. ఇలా అప్లై చేసుకోవచ్చు

Mudra Loan:- నిధుల కోసం కటకటలాడే చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి చేయూతనిచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ ముద్ర యోజన ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ తక్కువ వడ్డీ రేటుకే చిన్న వ్యాపారులకు రూ.10 లక్షల దాకా రుణాలు అందిస్తుంది.


ముఖ్యంగా చిన్న మధ్య తరహా కంపెనీలకు ఎక్కువ లోన్స్ ఇస్తోంది ప్రభుత్వం. దేశంలో ఉన్న 5.75 కోట్లకు చిన్న కంపెనీలే దాదాపు 12 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. పెద్ద సంస్థల్లో కేవలం 1.25 కోట్ల మందే ఉపాధి పొందుతున్నారు. అందుకే, చిన్న కంపెనీలు, వ్యాపారులకు తోడ్పాటు అందించేందుకు ముద్ర పథకాన్ని తీసుకొచ్చారు,

మైక్రో యూనిట్ల అభివృద్ధి, రీఫైనాన్సింగ్ కార్యకలాపాల కోసం  చిన్న తరహా వ్యాపారవేత్తలకు 50వేల నుంచి 10 లక్షల దాకా ముద్ర రుణాలు ఇస్తారు. రిస్కును బట్టి వడ్డీ రేటు నిర్ణయిస్తారు.


ఇందులో శిశు, కిశోర్, తరుణ్ పేరిట మూడు రకాల పథకాల కింద ముద్ర యోజన లోన్లు ఇస్తారు. శిశు పథకం కింద 50వేల దాకా లోన్ ఇస్తే.. కిశోర్ కింద 5 లక్షల వరకు, తరుణ్ కింద 5 లక్షల నుంచి 10 లక్షల దాకా రుణాలు ఇస్తారు. ఈ లోన్స్ తీసుకునేందుకు ఏదైనా వ్యాపారం లేదా చిన్న కంపెనీ నడుపుతూ ఉండాలి. తయారీ, ప్రాసెసింగ్, వ్యాపార లేదా సేవా రంగంలో ఉండాలి. రుణం అవసరం ఉన్న వాళ్లు దగ్గర్లోని బ్యాంక్,  మైక్రో ఫైనాన్స్ సంస్థలు, లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను సంప్రదించాలి. గుర్తింపు కోసం ఓటర్ ఐడి లేదా  డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్టులలో ఏదో ఒకటి ఇవ్వొచ్చు.

మెషినరీ లేదా ఇతర వస్తువుల కొనుగోలు కోసం కొటేషన్.
యంత్రాల ధర కొనుగోలు వివరాలు, వ్యాపార సంస్థ యాజమాన్యానికి సంబంధించిన లైసెన్సు లూదా ఇతర పత్రాలు డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ముద్ర లోన్లకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. హామీ కూడా అక్కర్లేదు. 

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×