EPAPER

Kisan Vikas Patra:- రూ.10 లక్షలు డిపాజిట్ చేయండి.. 20 లక్షలు సంపాదించండి..

Kisan Vikas Patra:- రూ.10 లక్షలు డిపాజిట్ చేయండి.. 20 లక్షలు సంపాదించండి..

Kisan Vikas Patra:- పెట్టుబడి అనగానే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ డిపాజిట్లు, పోస్టాఫీస్ సేవింగ్స్ అని మాత్రమే అనుకుంటారు. పెద్దగా పట్టించుకోరు గాని కిసాన్ వికాస్ పత్ర కూడా మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. ఈ మధ్యే కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేటును కూడా పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెరిగిన రేట్లు ఏప్రిల్ 1, 2023 నుంచే అమల్లోకి వచ్చాయి. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో చేరి, పెట్టుబడిని ఒక నిర్దిష్ట సమయం తరువాత తీసుకుంటే.. పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది.


ఈ కిసాన్ వికాస్ పత్ర పథకాన్ని పోస్టాఫీస్ ఆఫర్ చేస్తోంది. దీన్నే షార్ట్ కట్‌లో కేవీపీ పథకం అని కూడా అంటారు. ఈ స్కీమ్‌లో చేరి.. పెట్టుబడిని ఒక నిర్దిష్ట సమయం తరువాత రెట్టింపు చేసుకోవచ్చు. తాజాగా ఇటీవల వికాస్ పత్ర పథకం వడ్డీ రేటును పెంచారు. పెరిగిన రేటు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

కిసాన్ వికాస్ పత్ర సేవింగ్ స్కీమ్ వడ్డీ రేటు 7.2 శాతంగా ఉండగా, ఈ మధ్యే దీన్ని 7.5 శాతానికి పెంచారు. కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి పెడితే.. ఓ ఫిక్స్‌డ్ టైమ్ తర్వాత అది రెట్టింపు అవుతుంది. కేవీపీపై 7.2 శాతం వడ్డీని చెల్లించే సమయంలో, పెట్టుబడిదారుల డబ్బు రెట్టింపు కావడానికి 120 నెలల సమయం పట్టేది. అయితే ఇప్పుడు ఈ పథకంపై వడ్డీ రేటు 7.5 శాతానికి పెరగడంతో 120 నెలలకు బదులుగా 115 నెలల్లోనే అంటే.. 9 ఏళ్ల 7 నెలల్లో రెట్టింపు అవుతంది. అంటే డబ్బు రెట్టింపు అయ్యే వ్యవధిలో ఐదు నెలలు తగ్గింది.


ఆ లెక్కన కిసాన్ వికాస్ పత్రలో 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే… 115 నెలల్లో 20 లక్షల రూపాయలు అవుతుంది.

పోస్టాఫీస్‌లో కిసాన్ వికాస్ పత్ర అకౌంట్ ను కనీసం వెయ్యి రూపాయలతో ఓపెన్ చేయాలి. గరిష్ట డిపాజిట్‌పై పరిమితి లేదు. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ కూడా తెరవొచ్చు. గరిష్టంగా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్‌ను ఓపెన్ చేయడానికి అవకాశం కల్పించారు. మైనర్ పేరుతో గార్డియన్ ఈ స్కీమ్‌లో అకౌంట్ తీసుకోవచ్చు.

ఒక్కసారి ఈ పథకంలో పెట్టుబడి పెడితే, నిధుల కోసం మెచ్యూరిటీ వరకు వేచి ఉండాలి. ఎందుకంటే స్కీమ్ మెచ్యూరిటీ సమయం ముగిసిన తర్వాతనే డబ్బులు రెట్టింపు అవుతుంది. ఒకవేళ ఏదైనా అవసరం ఏర్పడి మధ్యలో విత్‌డ్రా చేస్తే అశించిన స్థాయిలో రాబడి ఉండకపోవచ్చు. 

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×