EPAPER

Jio Air Fiber:- ప్రత్యర్థులు అందుకోలేని స్థాయికి జియో.. ఎయిర్ ఫైబర్ సంచలనం

Jio Air Fiber:- ప్రత్యర్థులు అందుకోలేని స్థాయికి జియో.. ఎయిర్ ఫైబర్ సంచలనం

Jio Air Fiber:- జియో అంటేనే సంచలనం. ప్రత్యర్థుల కంటే పై చేయి సాధించే ప్రయత్నంలో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని తీసుకొస్తూనే ఉంది. ఇప్పుడు ఎయిర్ ఫైబర్ అనే కొత్త కాన్సెప్ట్‌ను ఇండియాలో లాంచ్ చేస్తోంది రిలయన్స్ జియో. 2022లో జరిగిన 45వ రిలయన్స్ ఏజీఎంలో అనౌన్స్ చేసినప్పటికీ.. ప్రైస్, రిలీజ్ డేట్స్ ప్రకటించలేదు. కాని, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌ కిరణ్‌ థామస్‌ జియో ఫైబర్‌ లాంఛింగ్‌పై స్పందించారు. మరికొద్ది నెలల్లోనే ఎయిర్‌ఫైబర్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు తెలిపారు.


జియో తీసుకొస్తున్న ఎయిర్ ఫైబర్.. ఎయిర్‌ టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, యాక్ట్‌ వంటి ఫిక్స్‌డ్‌ లైన్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు అందించే సంస్థలకు గట్టిపోటీ ఇవ్వనుంది. జియో ఎయిర్‌ఫైబర్‌ డివైజ్‌ సాయంతో.. వైఫై తరహాలో ఎటువంటి వైర్లు లేకుండా ఇంట్లో 5జీ ఇంటర్నెట్‌, హాట్‌స్పాట్‌ వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్‌ఫైబర్‌ డివైజ్‌ను ఆఫ్‌, ఆన్‌ చేస్తే సరిపోతుంది. అత్యంత సులభంగా, వేగంగా ఇంట్లో, ఆఫీస్‌లో సెకనుకు వెయ్యి మెగాబైట్లు అంటే గిగాబైట్‌ స్పీడ్‌ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. దగ్గర్లోని జియో టవర్స్‌ నుంచి వీటికి సిగ్నల్స్‌ అందుతాయి.

జియో ఎయిర్‌ఫైబర్‌ ధర ప్రైస్ పైనే ఇప్పుడు ఫోకస్ అంతా. జియో అధికారికంగా పోర్టబుల్ రూటర్లను రూ. 2,800కి, మెష్ ఎక్స్‌టెండర్ రూ. 2,499, జియో ఎక్స్‌టెండర్‌ 6 మెష్‌ వైఫై సిస్టం ధర రూ. 9,999గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ సరి కొత్త వైర్‌లెస్ రూటర్ ధర రూ. 10,000 ఉంటుందని అంచనా వేస్తున్నాయి. అయితే, వీటితో పాటు అదనపు ప్రయోజనాలను కూడా జియో అందించవచ్చని తెలుస్తోంది. ఆల్రడీ ఫైబర్ కనెక్షన్ పెట్టించుకున్న వాళ్లు.. కొత్తగా ఈ ఎయిర్ ఫైబర్ సేవలు పెట్టించుకోవాలంటే.. కచ్చితంగా ఆఫర్లు ప్రకటించాల్సిందే. సో, ఎయిర్ ఫైబర్ ధర కంటే… జియో ప్రకటించబోయే ఆఫర్లపైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు కస్టమర్లు. 


Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×