EPAPER
Kirrak Couples Episode 1

Help Farmers:- చైనాలో రైతులకు అండగా శాస్త్రవేత్తలు..

Help Farmers:- చైనాలో రైతులకు అండగా శాస్త్రవేత్తలు..

Scientists Help Farmers:- సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత పెరిగినా.. ఇప్పటికీ పలు దేశాల ఆదాయం వ్యవసాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు కనిపెడుతున్న కొత్త కొత్త టెక్నాలజీలను కూడా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందడానికి ఉపయోగిస్తున్నారు. అందులో చైనా ఇతర దేశాలకంటే కాస్త ముందుగానే ఆలోచనలు చేస్తోంది. అందుకే గ్రీన్‌హౌజ్ అనే కొత్త టెక్నాలజీని రైతులకు సాయంగా ఉండేందుకు తయారు చేసింది.


హనీడ్యూ మెలాన్స్ అనేవి చైనాలో ఫేమస్ పంట. చాలామంది రైతులు ఈ మెలాన్స్‌ను పండిస్తూ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈ పంట కోసం వెజిటేబుల్ గ్రీన్‌హౌజ్ అనే కొత్త టెక్నాలజీని తయారు చేసి పలు పంటలపై పరిశోధనలు కూడా చేశారు శాస్త్రవేత్తలు. 0.4 హెక్టార్లలో సెంట్రల్ చైనాలోని లంకావ్ కౌంటీలో ఈ గ్రీన్‌హౌజ్ అనేది ఏర్పాటయ్యింది. ఆరేళ్ల ముందు మెలాన్స్‌ను పండించడం కోసం ఈ టెక్నిక్‌ను ప్రారంభించారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ఈ గ్రీన్‌హౌజ్ టెక్నాలజీ సెంట్రల్ చైనాలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.

గ్రీన్‌హౌజ్ వల్ల మెలాన్స్ పంట అనేది బాగా పండుతుందని, దాని వల్ల చాలా లాభాలు కూడా వస్తున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సెంట్రల్ చైనాలో పలువురు శాస్త్రవేత్తలు వాలంటీర్లుగా మారి గ్రీన్‌హౌజ్ వల్ల జరిగే ప్రయోజనాలు, వాటి నుండి వచ్చే రిజల్ట్స్‌ను దగ్గరుండి చూస్తున్నారు. దీని వల్ల వ్యవసాయ రంగంలో ఉండే సమస్యలను కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తూ రైతులకు సాయంగా నిలుస్తున్నారు అక్కడి శాస్త్రవేత్తలు.


రైతుకు పంట విషయంలో ఏదైనా అనుమానాలు ఉన్నా.. ఏమైనా సమస్యలు ఎదురైనా కూడా ఒక్క ఫోన్ కొడితే వాలంటీర్లు వారికి సాయంగా వచ్చేస్తారు. చైనా వ్యాప్తంగా మొత్తం 90,000 సహాయక గ్రూపులు ఏర్పాటయ్యాయి. 4.2 మిలియన్ శాస్త్రవేత్తలు పూర్తిగా సైన్స్ అండ్ టెక్నాలజీని వ్యవసాయ రంగంలో ఎలా ఉపయోగిస్తే బాగుంటుంది అనే విషయంపైనే పనిచేస్తున్నారు. ఇది విన్న పలువురు నిపుణులు.. ఇలాంటి పద్ధతి ప్రతీ దేశంలో వస్తే వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కునే సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

How To Check iPhone Is Real Or Fake : ఐఫోన్ కొంటున్నారా? మరి అది ఒరిజినలా? ఫేకా.. అనేది ఇలా కనిపెట్టేయండి

Whatsapp New Features 2024 : వాట్సాప్ ప్రియులకు కిక్ ఇచ్చే అప్డేట్.. కొత్తగా ఈ 3 ఫీచర్స్

Jio Recharge Plan : జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్ – మరో సరికొత్త ​ప్లాన్​ తో వచ్చేసిన టెలికాం దిగ్గజం

Iphone 15 : పండగ సేల్ ఆఫర్​​ – ఐఫోన్​ 15, ఐఫోన్ 13పై కళ్లు చెదిరే డిస్కౌంట్​!

Samsung : రూ.10వేలకే శాంసాంగ్ 5G ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Amazon Great India Festival Sale 2024 : సామ్ సాంగ్ మెుబైల్స్ మరీ ఇంత చౌకా.. దిమ్మతిరిగే డీల్స్ మీకోసం!

iPhone 15: మతిపోగొట్టే ఆఫర్.. జస్ట్ రూ.15,650కే ఐఫోన్ 15, ఎలా కొనాలో తెలుసా?

Big Stories

×