EPAPER

IPL : గుజరాత్ జోరు.. ముంబై చిత్తు..

IPL : గుజరాత్ జోరు.. ముంబై చిత్తు..

IPL Match Updates(GT vs MI): ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. తాజాగా ఆ జట్టు ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ (56), డేవిడ్ మిల్లర్ (46), అభినవ్ మనోహర్ (42) చెలరేగడంతో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. చివరిలో రాహుల్ తెవాటియా (20, 5 బంతుల్లో 3 సిక్సులు) మెరుపులు మెరిపించడంతో టైటాన్స్ స్కోర్ 200 దాటింది. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా 2 వికెట్లు, అర్జున్ టెండూల్కర్, బెరెన్ డార్ఫ్ , మెరిడిత్, కుమార్ కార్తికేయ తలో వికెట్ తీశారు.


భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆది నుంచి తడబడింది. కెప్టెన్ రోహిత్ (2), ఇషాన్ కిషన్ (13), తిలక్ వర్మ (2), టిమ్ డేవిడ్ (0) విఫలం కావడంతో 59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పరాజయం ఖాయం చేసుకుంది. గ్రీన్ (33), సూర్యకుమార్ (23), నేహల్ వదేర (40) కాసేపు మెరుపులు మెరిపించి స్కోరును పెంచారు. ఈ మ్యాచ్ ద్వారా తొలిసారిగా బ్యాటింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న అర్జున్ టెండూల్కర్ ఒక సిక్సర్ బాదాడు. 9 బంతుల్లో 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 20 ఓవర్లు ముగిసే సరికి ముంబై 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గుజరాత్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.

గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు తీశారు. హార్ధిక్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది. బ్యాటింగ్ లో అదరగొట్టిన అభినవ్ మనోహర్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించిన హార్ధిక్ సేన పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ముంబై 7 మ్యాచ్ ల్లో 3 విజయాలతో 7 స్థానంలో ఉంది.


Related News

Women’s T20 World Cup: పాక్‌పై విక్టరీ.. టీమిండియా సెమీస్ చేరడం ఎలా..?

IND vs AUS: బంగ్లాకు ట్రైలర్‌ మాత్రమే..ఆస్ట్రేలియాకు సినిమా చూపించనున్న టీమిండియా..?

IND vs BAN: విడాకుల తర్వాత పాండ్యా విధ్వంసం.. బంగ్లాపై భారత్ ఘన విజయం!

IPL 2025: ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్‌పై కొత్త పంచాయితీ…చిక్కుల్లో ఓనర్లు?

Hardik Pandya: పాండ్యాకు 18 కోట్లు దండగే..ముంబై సంచలన నిర్ణయం ?

Ind vs Ban 1st T20: ఇవాళ బంగ్లా, టీమిండియా మధ్య టీ20..జట్లు, టైమింగ్స్ వివరాలు ఇవే !

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

×