EPAPER

Sleep Tips : సరిగా నిద్రపోక పోతే జరిగేది ఇదే

Sleep Tips : సరిగా నిద్రపోక పోతే జరిగేది ఇదే

Sleep Tips : ఆహారం, నీళ్లు మనిషికి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్రతోనే మన శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. రోజుకు కనీసం 8 గంటలు నిద్రించకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోయేవారు తర్వాత రోజు యాక్టివ్‌గా పనిచేయలేరని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి సమయంలో సరిగా నిద్రపోకుండా మేల్కొని ఉంటే ఒబిసిటీ, గుండె సంబంధిత వ్యాధులు, హైబీపీ, మధుమేహం, నిద్రలేమి సమస్యల బారిన పడక తప్పదు. సుఖమైన నిద్ర కోసం పడక గది నిశ్బద్ధంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రిస్తున్న సమయంలో రూమ్‌లో ఎక్కువ వెలుతురు ఉండకూడదు. సాయంత్రం తర్వాత టీ, కాఫీ, కూల్‌ డ్రింక్స్‌ తాగొద్దు. ప్రతి రోజు ఒకే సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. పగలు సమయంలో ఒక చిన్న కునుకు వేస్తే సరిపోతుంది. అంతేకానీ ఎక్కువ సేపు పడుకోకూడదు. రాత్రి బాగా నిద్రపట్టాలంటే గోరు వెచ్చని పాలని తాగండి. పాలలో ఉన్న ట్రిస్టోఫ్యాన్‌ వల్ల బాగా నిద్రపడుతుంది. నిద్రించేముందు బుక్స్‌, టీవీ చూడటం చేయొద్దని నిపుణులు అంటున్నారు.అంతే కాకుండా ఆల్కహాల్‌ అస్సలు తీసుకోవద్దని చెబుతున్నారు. నిద్రలోనూ మన మెదడు పనిచేస్తుంటుంది. కాకపోతే చురుకుదనం, పరిసరాలపై చైతన్యం తగ్గుతుంది. అవయవాలు, మెదడు బాహ్య విషయాలను మరచిపోయి విశ్రాంతి తీసుకోవడమే నిద్ర ఉద్దేశం. చిన్నారులు, యువకుల్లో నిద్రపోయే సమయంలోనే శరీర ఎదుగుదలకు అవసరమైన గ్రోత్‌ హార్మోన్‌ విడుదల అవుతుంది. నిద్రపోయే సమయం అందరిలో ఒకేలా ఉండదు. పసిపిల్లలు రోజుకు 16 గంటలయినా పడుకుంటారు. యుక్త వయసు ఉన్నవారు 8 నుంచి 9 గంటలు నిద్రిస్తారు. పెద్దలు రోజుకు 5 నుంచి 9 గంటలు నిద్రపోవడం అవసరం. సరిగా నిద్రపోకపోతే ఏకాగ్రత దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి. శరీర సామర్థ్యంకూడా తగ్గిపోతుంది. పగటిపూట నిద్ర పోవడం వల్ల ఆందోళన, చికాకు వస్తుంది. శారీరకంగా, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వస్తుంది. కాబట్టి రాత్రి నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.


Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×