Samsung:- ప్రపంచవ్యాప్తంగా రోజుకొక కొత్త టెక్నాలజీ సంస్థ పుట్టుకొస్తోంది. అయినా కూడా ఇప్పటికీ కొన్ని పాత సంస్థల పేర్లు ప్రజల్లో చాలా పాపులర్‌గా ఉన్నాయి. ఎప్పుడో ప్రారంభమయిన కొన్ని సంస్థలు కూడా ఎప్పటికప్పుడు పోటీని ఎదిరిస్తూ ముందుకెళ్తున్నాయి. అందులో ఒకటి సామ్‌సంగ్. అయితే గత 15 ఏళ్లుగా సామ్‌సంగ్ హిస్టరీలో జరగని విషయం ఒకటి తాజాగా జరిగింది. ఇది యాజమాన్యానికి మాత్రమే కాకుండా యూజర్లకు కూడా షాకిచ్చింది.
సామ్‌సంగ్ అనేది ముందుగా చిప్ మేకర్ సంస్థగా ప్రారంభమయ్యి మెమోరీ చిప్స్ తయారీలో తనకంటే గొప్ప సంస్థ ఏదీ లేదని నిరూపించుకుంది. కానీ గత 15 మొదటిసారి సామ్‌సంగ్ నష్టాలను చవిచూసింది. చిప్స్ విషయంలోనే కాదు మొబైల్ సేల్స్ విషయంలో కూడా సామ్‌సంగ్ వెనకబడడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి ఎన్నో కొత్త రకమైన ఫోన్లు వస్తున్నాయి. పైగా ఈమధ్యకాలంలో ఐఫోన్ లాంటి సంస్థ కూడా ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తూ, అప్డేట్స్ ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
2023లోని మొదటి క్వార్టర్‌లో ఇప్పటికే సామ్‌సంగ్ తీవ్ర నష్టాలను చవిచూసినట్టు సమాచారం. ప్రస్తుతం సామ్‌సంగ్ ఆపరేటింగ్ లాస్ 1.28 ట్రిలియన్ (అంటే 961 మిలియన్ డాలర్లు) అని లెక్కలు చెప్తున్నాయి. ఆపరేటంగ్ ప్రాఫిట్‌ను 95.75 శాతంగా అంచనా వేసుకున్న సామ్‌సంగ్‌కు ఇది కోలుకోలేని దెబ్బ అని కొందరు నిపుణులు చెప్తున్నారు. 2008 నుండి ఏ మొదటి క్వార్టర్‌లో కూడా సామ్‌సంగ్ అసలు నష్టాల్లోకి వెళ్లలేదని సమాచారం.
సామ్‌సంగ్ మాత్రం ఈ వివరాలు ఏమీ స్వయంగా బయటపెట్టలేదు. ఎక్కువగా ఈ నష్టమంతా స్మార్ట్ ఫోన్స్ ద్వారానే వచ్చిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెకండ్ క్వార్టర్‌లో స్మార్ట్ ఫోన్స్ ద్వారా మరింత నష్టం పెరగే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో స్మార్ట్ ఫోన్లకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అందుకే స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా కొత్త మోడల్స్‌తో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సామ్‌సంగ్ కూడా అలా చేస్తే తప్ప కొంచెం అయినా నష్టాల నుండి బయటపడలేదని నిపుణులు సలహా ఇస్తున్నారు.