EPAPER
Kirrak Couples Episode 1

Viveka Murder Case : నేడు సుప్రీంకోర్టులో విచారణ .. తీర్పుపై ఉత్కంఠ..

Viveka Murder Case : నేడు సుప్రీంకోర్టులో  విచారణ  .. తీర్పుపై ఉత్కంఠ..

Viveka Murder Case : అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వివేకా కూతురు సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది. నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని గతంలో హైకోర్టు తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే సోమవారం వరకు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయొద్దని ఆదేశాలిచ్చింది. నేడు సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.


వివేకా హత్య కేసు విచారణలో సేకరించిన వివరాలను తీసుకుని సీబీఐ బృందం ఢిల్లీ వెళ్లింది. విచారణలో వెల్లడైన అంశాలతోపాటు సాంకేతిక ఆధారాలను తీసుకుని ఈ బృందం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 30లోపే వివేకా హత్య కేసు దర్యాప్తును పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల కస్టడీ సోమవారంతో ముగియనుంది. హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో ఆదివారం ఐదోరోజు వారిద్దర్నీ సీబీఐ బృందం విచారించింది. కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు సీబీఐ మరోసారి నిందితులను కస్టడీకి కోరే అవకాశముందని సమాచారం. మధ్యాహ్నం భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు


Related News

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

YS Jagan: ఒంటరైన జగన్.. అన్ని డోర్లు క్లోజ్

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ

Tirumala Laddu Issue: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

Pawan Kalyan Prayaschitta Deeksha: ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్.. టీటీడీ బోర్డు ఏం చేసింది ?

Big Stories

×