EPAPER
Kirrak Couples Episode 1

SRH : సన్ రైజర్స్ హైదరాబాద్.. జట్టులో తెలుగోళ్లు ఎక్కడ..?

SRH : సన్ రైజర్స్ హైదరాబాద్.. జట్టులో తెలుగోళ్లు ఎక్కడ..?

SRH : సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) అని పేరు పెట్టుకున్నా కానీ జట్టులో ఒక్కరికి మించి తెలుగు ప్లేయర్ లేకపోవడం దురదృష్టకరం. కోట్లు పోసి పక్క రాష్ట్రాలు, విదేశీ ప్లేయర్లను కొంటున్న ప్రాంచైజీ తెలుగు ప్లేయర్స్ ను మాత్రం చిన్న చూపు చూస్తోంది. 10 జట్లున్న లీగ్‌లో అన్ని జట్లు లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తుంటే SRH మాత్రం అటువైపే చూడడం లేదు.
2012లో వచ్చినా..
చెన్నైకి చెందిన కళానిధి మారన్ SRH జట్టును 2012లో దక్కించుకున్నారు. SRH మాత్రం తన జర్నీని 2013 నుంచి స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే కప్పు కొట్టిన ఆరెంజ్ ఆర్మీలో ఈ పది సంవత్సరాలలో ఆడిన తెలుగు ప్లేయర్లను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. SRHకు ఆడి జాతీయ జట్టుకు సెలెక్ట్ అయిన తెలంగాణ ప్లేయర్లు కానీ ఆంధ్రా ప్లేయర్లు కానీ భూతద్దం పెట్టి వెతికినా కానీ కనిపించరంటే అతిశయోక్తి కాదు.
కావ్యాకు సెల్యూట్..
కావ్యా మారన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఆమెకు తప్ప భగవంతుడికి కూడా అర్థం కాదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. విదేశీ ప్లేయర్లపై కోట్లు పెడుతున్నావు. తెలుగు ప్లేయర్స్ కంటికి కనిపించడం లేదా అని ట్రోల్ చేస్తున్నారు.
కావాలనేనా..?
SRH ప్రాంచైజీ ఓనర్ తెలుగు వ్యక్తి కాదు. అతడో తమిళ బిజినెస్‌మెన్. ఇక ప్రస్తుతం టీమ్‌తో కలిసి ట్రావెల్ చేస్తున్న కావ్యా మారన్ ఆయన కూతురు. అందుకే తెలుగు ఆటగాళ్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి.
తెలుగువారు ఎక్కడ..?
తెలుగు ప్లేయర్స్ మాత్రమే కాదు తెలుగు సపోర్ట్ స్టాఫ్ కూడా SRHలో ఉన్నట్లు కనిపించడంలేదు. లెజండరీ లక్ష్మణ్ SRH మెంటార్‌గా సేవలందించాడు. కానీ అతడు నేషనల్ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ అయిన తర్వాత SRHకు గుడ్ బై చెప్పాడు.


వార్నర్‌తో వాటర్ మోయించారు..?
స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో SRH ప్రాంచైజీ వాటర్ బాటిల్స్ మోయించింది. 2016లో వార్నర్ నేతృత్వంలోనే ట్రోఫీని గెలిచింది. ఆ తర్వాత వేలంలోనే అతడిని వదిలేసింది. కప్పు తెచ్చిన వార్నర్ విషయంలో అలా ప్రవర్తించడంతో SRH ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా చాలా హర్ట్ అయ్యారు. వారంతా SRHను ఆడుకున్నారు. హైదరాబాదీలు వార్నర్‌తో ఎంతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. వార్నర్ భాయ్ అని ముద్దుగా పిల్చుకునే అతడితో వాటర్ మోయించడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
రషీద్‌నూ వద్దనుకున్నారు..
తన స్పిన్‌తో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టే అఫ్ఘాన్ స్టార్ రషీద్ ఖాన్‌ను కూడా SRH వదిలేసుకుంది. అతడు గుజరాత్ టైటాన్స్ ప్రాంచైజీకి వెళ్లి.. అక్కడ వాళ్లు టైటిల్ గెలవడంలో కీ రోల్ పోషించాడు. అతడికి వైస్ కెప్టెన్సీ పగ్గాలిచ్చి గుజరాత్ అందలం ఎక్కించింది. అయితే రషీద్ విషయంలో అతడే జట్టును వీడతానని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై ప్రాంచైజీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
చివరికి కేన్ మామను కూడా..
డేవిడ్ వార్నర్‌ను వేలంలోకి వదిలేసి న్యూజిలాండ్ కు చెందిన కేన్ విలియమ్సన్ కు ఆరెంజ్ ఆర్మీ పగ్గాలను అప్పజెప్పింది. కానీ ఈ సారి వేలం సమయానికి కేన్ మామను కూడా వదిలేసింది. దీంతో ఇక SRH ఫ్యాన్స్ జట్టును దూషిస్తూ ట్వీట్లు చేశారు.
2023 వేలం..
2023 వేలానికి ముందు అత్యధిక పర్స్ ఉన్న జట్టుగా SRH నిలిచింది. నికోలస్ పూరన్ (వెస్టిండీస్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) లాంటి పెద్ద పెద్ద స్టార్లను వదిలేయడంతో భారీగా డబ్బులు ఉన్నాయి. ఇక వేలంలో హాట్ పిక్స్ అయిన గ్రీన్, స్టోక్స్, శామ్ కర్రన్ వీరిలో ఎవర్నో ఒకరిని కొంటారని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఎంత రేటైనా పెట్టేందుకు డబ్బులున్నాయి. కానీ తీరా వేలం చూస్తే మాత్రం ఆశ్చర్యం వేసింది. వారిలో ఎవర్నీ నమ్మని ఆరెంజ్ ఆర్మీ రూ. 13.25 కోట్లు పెట్టి ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ను కొనుగోలు చేసింది. అతడిని పోటీ పడి మరీ దక్కించుకుంది.

ప్రస్థానమిదే..!
2013- ప్లే ఆఫ్స్
2014- గ్రూప్ స్టేజ్
2015- గ్రూప్ స్టేజ్
2016- విన్నర్స్
2017- ప్లే ఆఫ్స్
2018- రన్నరప్స్
2019 ప్లే ఆఫ్స్
2020- ప్లే ఆఫ్స్
2021- గ్రూప్ స్టేజ్
2022- గ్రూప్ స్టేజ్
2023- 6 మ్యా చ్ లు ఆడితే 2 గెలిచి తొమ్మిదో స్థానం
సమద్ పై అంత గురేంటో..?
అబ్దుల్ సమద్.. జమ్మూకు చెందిన ఈ బ్యాటర్‌ను SRH 2020 వేలంలో రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. అతడిని 2022 సమయంలో రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకుంది. మరి అంత మనీకి అతడు న్యాయం చేశాడా అంటే మాత్రం పక్క చూపులు చూడాల్సిన పరిస్థితి. అతడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒంటి చేత్తో కాకపోయినా కానీ నిలబడి గెలిపించిన మ్యాచ్ ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం.
ఉమ్రాన్ ‘స్పీడ్’ గన్నేనా..?
ఇక SRH రిటైన్ చేసుకున్న మరో ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్. జమ్మూకే చెందిన ఈ బౌలర్ స్పీడ్ స్టర్ . అతడు బౌలింగ్ లో వేగం తప్పా మరేమీ ఉండదని వేగం కంటే వేరియేషన్స్‌తో వేసేవాళ్లే గొప్ప బౌలర్లు అవుతారని అంతా కామెంట్ చేస్తున్నారు.
తెలుగు వెలుగు కనబడట్లేదా..?
SRH ప్రాంచైజీకి తెలుగు వెలుగు కనబడడం లేదా అని అంతా కామెంట్ చేస్తున్నారు. తెలుగు నాట పుట్టిన క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న అంబటి రాయుడు, తిలక్ వర్మ, శ్రీకర్ భరత్ లాంటి ఎందరో ప్లేయర్స్ ఇతర ప్రాంచైజీలకు ఆడుతూ అదరగొడుతున్నారు. ఈ విషయాన్ని ఆరెంజ్ ఆర్మీ ఎప్పుడు తెలుసుకుంటుందో..!


Related News

IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

Big Stories

×