Arjun Tendulkar : అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ యాక్షన్‌పై ఇంకా కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. పరిగెత్తుకొచ్చినంత వేగంగా బాల్స్ సంధించలేకపోతున్నాడంటూ ఫస్ట్ మ్యాచ్‌లోనే విమర్శలు వచ్చాయి. అయితే, ఆ నెక్ట్స్ మ్యాచ్‌లోనే వికెట్ తీయడంతో అందరూ ఆ విషయం మరిచిపోయారు. పైగా ఇదే ఐపీఎల్ సీజన్ కావడం, సచిన్ టెండూల్కర్ తనయుడు అవడంతో ఎవరూ పెద్దగా కామెంట్స్ చేయలేదు. కాని, పాక్ ప్లేయర్స్ ఊరుకుంటారా. కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. నిజానికి ఇలాంటి విమర్శలు వస్తేనే ఆటతీరు మరింత మెరుగుపరుచుకోవచ్చు. లేదంటే.. ఆ పొగడ్తల మధ్యే జీవితం నాశనం కావొచ్చు.
పాక్ మాజీ కెప్టెన్ లతీఫ్… అర్జున్ టెండూల్కర్ పై పెద్ద కామెంట్లే చేశాడు. అర్జున్ అలైన్‌మెంట్ బాగున్నా.. పేస్‌ను జనరేట్ చేయలేకపోతున్నాడని చెప్పుకొచ్చాడు. నిజానికి ఇది విమర్శ కాదు.. ఒకింత నిజమే చెప్పాడు. ఎవరైనా మంచి బయోమెకానికల్ కన్సల్టెంట్ అర్జున్ బౌలింగ్‌ను చక్కదిద్దగలడని సలహా ఇచ్చాడు. సచిన్ తలచుకుంటే.. తనే స్వయంగా ఆ పని చేయగలడని, అర్జున్ బౌలింగ్‌కు మరింత పేస్‌ను జోడించగలడని చెప్పుకొచ్చాడు.
రషీద్ లతీఫ్ చేసిన మరో కామెంట్.. అతని బ్యాలెన్స్. సరిగా బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్ల అది పేస్‌పై ఎఫెక్ట్ చూపిస్తోందంటున్నాడు లతీఫ్. అర్జున్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాడు కాబట్టి.. ఇంకాస్త ట్రైనింగ్ ఇప్పిస్తే 135 కిలోమీటర్ల వేగం అందుకుంటాడని, అర్జున్ బ్యాటింగ్ కూడా బాగుంది లతీఫ్ మెచ్చుకున్నాడు.