EPAPER
Kirrak Couples Episode 1

Synthetic Spider Silk:- స్పైడర్ సిల్క్‌తో క్లాతింగ్ ఇండస్ట్రీలో కొత్త ప్రయోగాలు..

Synthetic Spider Silk:- స్పైడర్ సిల్క్‌తో క్లాతింగ్ ఇండస్ట్రీలో కొత్త ప్రయోగాలు..

Synthetic Spider Silk:- ప్రపంచంలో బలమైనది ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తారు. బరువును బట్టి బలం తెలుస్తుందని చాలామంది అభిప్రాయం. కానీ బరువుకు, వస్తువు బలానికి ఏ మాత్రం సంబంధం ఉండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానికి ఉదాహరణగా స్పైడర్ సిల్క్‌ను తీసుకున్నారు. స్పైడర్స్ తయారు చేసే నేచురల్ సిల్క్ అన్నది చూడడానికి చాలా సన్నగా ఉన్నా కూడా అందులో చాలా బలం ఉంటుందని, అందుకే దానిపై పరిశోధనలు చేయాలని వారు నిర్ణయించుకున్నారు.


స్పైడర్ సిల్క్ అనేది ఏ మాత్రం బలువు లేనట్టుగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. కానీ అది స్టీల్ కంటే స్ట్రాంగ్ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తాజాగా పలువురు శాస్త్రవేత్తలు కలిసి ఈ సింథటిక్ స్పైడర్ సిల్క్‌తో కొత్త రకమైన బట్టలను తయారు చేశారు. ఇవి క్లోతింగ్ ఇండస్ట్రీలోనే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాయని వారు బలంగా నమ్ముతున్నారు. 2018లో బ్యాక్టీరియాను ఉపయోగించిన స్పైడర్ సిల్క్ నుండి రసాయానాన్ని తయారు చేశారు. అప్పటినుండి స్పైడర్ సిల్క్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని గమనించిన శాస్త్రవేత్తలు దానిని మరింత మెరుగైన ప్రయోగాల కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.

మామూలుగా ఫ్యాషన్ ఇండస్ట్రీలో రెన్యూవబుల్ మెటీరియల్స్‌కు డిమాండ్ ఎక్కువ. కానీ స్పైడర్ సింథటిక్ సిల్క్‌తో బట్టలను రెన్యూవబుల్ చేయడం కొంచెం కష్టమే. కానీ బట్టలను రెన్యూవల్ చేయడం ద్వారా ప్రతీ ఏడాది దాదాపు 100 బిలియన్ బట్టలు, 92 మిలియన్ టన్నుల క్లాత్ వేస్ట్ వృథాగా పోతోంది. దీనికి స్పైడర్ సింథటిక్ సిల్క్‌తో సమాధానం కనుక్కోవాలని శాస్త్రవేత్తలు భావించారు. ఒక ఫుట్ ప్రొటీన్ సాయంతో బైటర్మినల్ ఎమ్ఎఫ్పీ ఫ్యూజ్డ్ సిల్క్స్ (బీటీఎమ్ సిల్క్స్) అనే కొత్త రకమైన సిల్క్ ఫ్యూజన్‌ను తయారు చేశారు.


మిగతా సిల్క్స్‌తో పోలిస్తే బీటీఎమ్ సిల్క్స్ అనేది చాలా ధృడంగా ఉంటుంది. అంతే కాకుండా చాలా తక్కువ బరువు కూడా ఉంటుంది. ట్రెడీషినల్ క్లాతింగ్‌కు ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారి క్లాతింగ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికే వీరి ప్రయోగాల గురించి అంతర్జాతీయ మీడియాలో వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. స్పైడర్ సిల్క్‌ను ఇతర సిల్క్ ప్రొడక్ట్స్‌తో వేరుచేసిది అందులో ఉన్న ప్రొటీన్ సామర్థ్యమే అని ఇందులో శాస్త్రవేత్తలు ప్రకటించారు.

Related News

iphone demand in india : ఐఫోన్లకు భారీగా పెరిగిన గిరాకీ – డైమండ్స్​ను అధిగమించిన స్మార్ట్‌ ఫోన్ల విలువ!

Washing Machine Offers : వాషింగ్​ మెషీన్ కొనే ప్లాన్​లో ఉన్నారా? – అమెజాన్​లో ఈ మెషీన్లు ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ!

Amazon Smart Watch Sale : సూపర్ డీల్ బాస్.. ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడూ కొనలేరు.. స్మార్ట్ వాచెస్ పై అదిరిపోయే ఆఫర్స్!

Lava Agni 3 : స్పెషల్ ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ లాంఛ్… ప్రోసెసర్, కెమెరా ఫీచర్స్ అదుర్స్ గురూ!

Best Laptop Under 50000 : సేలా మజాకా.. హై క్వాలిటీ ల్యాప్ టాప్స్ పై మరీ ఇంత తగ్గింపా!

Whatsapp Updates 2024: వాట్సాప్ లో ఈ అప్డేట్స్ తెలుసా.. నెంబర్ సేవ్ చేయకుండానే సందేశాలు పంపేయండిలా!

Redmi Watch 5 Active Review : వాచ్ ఏంటి భయ్యా ఇంత ఉంది.. ఫీచర్స్ మాత్రం అదుర్స్.. రేట్ ఎంత అంటే?

Big Stories

×