EPAPER
Kirrak Couples Episode 1

Twitter : ఆ సెలబ్రిటీలకు ట్విట్టర్ షాక్.. బ్లూ టిక్ తొలగింపు.. ఎందుకంటే..?

Twitter : ఆ సెలబ్రిటీలకు ట్విట్టర్ షాక్.. బ్లూ టిక్ తొలగింపు.. ఎందుకంటే..?

Twitter News Updates: ట్విట్టర్ యజమాని ఎలాన్‌ మస్క్‌ బ్లా టిక్ యూజర్లకు షాక్ ఇచ్చారు. డబ్బులు చెల్లించని వారికి వెరిఫికేషన్‌ మార్క్‌ను తొలగించే చర్యలు చేపట్టారు. దీంతో చాలామంది తమ ఖాతాలకు బ్లూ టిక్ కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖుల ఖాతాలకు ట్విటర్‌ వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌లను తొలగించింది. ఇకపై నెలవారీ ప్రీమియం చెల్లించిన వారికి మాత్రమే వెరిఫైడ్‌ బ్లూ టిక్ మార్క్‌లను కొనసాగించనుంది. పోప్‌ ఫ్రాన్సిస్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ ట్విట్టర్ ఖాతాలకు బ్లూ టిక్‌ ను కోల్పోయారు.


భారత్‌లో పలువురు రాజకీయ ప్రముఖులు, పలు పార్టీల అధికారిక ఖాతాలకు బ్లూ టిక్‌ ను ట్విట్టర్ తొలగించింది. ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌, మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, యోగి ఆదిత్యనాథ్‌, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు , జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, కాంగ్రెస్ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాద్రా సహా పలువురు రాజకీయ నాయకుల ఖాతాలకు ఇప్పుడు వెరిఫైడ్‌ మార్క్‌ కన్పించట్లేదు. బీజేపీ, కాంగ్రెస్‌ సహా పలు రాజకీయ పార్టీల అధికారిక ఖాతాలకు బ్లూ టిక్‌ ను ట్విట్టర్ తొలగించింది.

చాలామంది సినీ సెలబ్రిటీలకు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, దీపికా పదుకొణె, ఆలియాభట్‌, చిరంజీవి, క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ అలాగే సైనా నెహ్వాల్‌, సానియా మీర్జా, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఖాతాలకూ వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌ తొలగించింది.


ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ అనేక సంస్కరణలు చేపట్టారు. సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. ఆ సంస్థలో కీలక పదవుల్లో ఉన్నవారిని ఇంటికి సాగనంపారు. చాలామంది ఉద్యోగులను తొలగించారు. అలాగే కొత్త యజమాని పెట్టిన రూల్స్ నచ్చక చాలామంది సంస్థను వీడారు.

మరోవైపు రెవెన్యూను పెంచుకునేందుకు బ్లూ టిక్‌కు సబ్‌స్క్రిప్షన్‌ తీసుకొచ్చారు. అనేక వాయిదాల తర్వాత బ్లూ టిక్‌ ప్రీమియం సేవలను ప్రారంభించారు. వెబ్‌ యూజర్లు నెలకు 8 డాలర్లు, ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు నెలకు 11 డాలర్లుగా నిర్ణయించారు. బ్లూ టిక్ యూజర్లకు ట్విట్టర్ లో తక్కువ యాడ్స్ కనిపిస్తాయి. అలాగే హై డురేషన్ వీడియోలను పోస్ట్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు డబ్బులు చెల్లించని వారికి ఖాతాలకు బ్లూ టిక్ తొలగించి షాక్ ఇచ్చారు.

Related News

Mohan Babu: లడ్డూ పేరుతో నక్క బుద్ధి బట్టబయలు.. సీఎం ను కాకా పట్టడానికేనా ఇదంతా.?

Bigg Boss 8 Day 20 Promo: పెళ్లాం పై కోపంతో బిగ్ బాస్.. అభయ్ ను బయటకు గెంటేసిన నాగార్జున..!

Devara Run Time : ఫియరే లేని దేవరకు ఫియర్ పట్టుకుందా… మరీ ఇంత కట్ చేశారేంటి.?

Samantha: సమంత సైలెంట్ ఏలా? టాలీవుడ్‌లో హేమా కమిటీ వేయాలన్న సామ్.. జానీ మాస్టర్ కేసుపై స్పందించదే?

Manchu Vishnu: కల్తీ లడ్డూ.. ప్రకాష్ రాజ్ కి కౌంటర్.. పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన విష్ణు..!

Tollywood heroine: తెలుగు హీరోయిన్ భర్తకి యాక్సిడెంట్.. ఐసీయూలో చేరిక.!

Saripodhaa Sanivaram: 28 రోజులకే ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..?

Big Stories

×