EPAPER

Chandrababu : నేడు పొలిటికల్ లెజెండ్ పుట్టిన రోజు..బాబు పేరే ఓ బ్రాండ్..

Chandrababu : నేడు పొలిటికల్ లెజెండ్ పుట్టిన రోజు..బాబు పేరే ఓ బ్రాండ్..

Chandrababu News(AP News Updates) : నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయనది. ఎన్నో విజయాలు సాధించారు. మరెన్నో పరాజయాలను ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 9 ఏళ్లుగా సీఎం బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచారు. 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగానూ ఉన్నారు. ఇలా ఉమ్మడి ఏపీలో తనదైన ముద్ర వేశారు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు. నేడు ఈ పొలిటికల్ లెజెండ్ పుట్టినరోజు.


ప్రజల నాడి తెలుసుకుంటూ కాలంతోపాటు పరిగెత్తే నాయకుడు చంద్రబాబు. సంక్షోభాల నుంచి అవకాశాలు వెతకడం ఆయన నైజం. 74వ ఏట అడుగుపెట్టిన చంద్రబాబు ఇప్పటికీ హుషారుగానే రాజకీయ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు.

చంద్రబాబు 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. 45 ఏళ్లకే ఉమ్మడి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన లాంటి వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. తొమ్మిదేళ్ల పాలనలో ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారు. వినూత్న ఆలోచనలతో ముందుకుసాగారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైదరాబాద్‌ కు అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ తెచ్చారు. సాంకేతికతను అందిపుచ్చుకుని పాలనలో విప్లవాత్మ మార్పులు తీసుకొచ్చారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు .. ఢిల్లీ రాజకీయాల్లోనూ చంద్రబాబు చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసమే నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిని చేశాయి. ఆ తర్వాత పలు సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒకవైపు లోటు బడ్జెట్‌, మరోవైపు రాజధాని లేని రాష్ట్రం, కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులను అధిగమించిన పాలన సాగించారు.

రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూ సమీకరణ ద్వారా రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించారు. పోలవరం ప్రాజెక్టులో కదలిక తీసుకొచ్చారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ద్వారా రైతులను సాగునీరు అందించారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవడంతో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు చంద్రబాబు. మళ్లీ అధికారం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటూ ఊరువాడా తిరుగుతున్నారు. 74 ఏళ్ల వయస్సులోనూ టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. నిజంగా చంద్రబాబు పొలిటికల్ లెజెండ్. ఆయన పేరే ఓ బ్రాండ్.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×