DRS in ipl 2023 : అంపైర్లు డీఆర్ఎస్ వాడొచ్చా? కచ్చితంగా ఉపయోగించుకోవచ్చని అంపైర్ నితిన్ మీనన్ ప్రపంచానికి చాటి చెప్పాడు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు ఇలా డీఆర్ఎస్ తీసుకొచ్చారు. నోబ్, ఇన్పిచ్, ఔట్ పిచ్ నుంచి అల్ట్రా ఎడ్జ్ వరకు అన్నీ చెక్ చేస్తారు. క్యాచ్, ఎల్బీడబ్ల్యూ వంటి వాటి కోసం కూడా అల్ట్రా ఎడ్జ్ వాడుకోవచ్చు. కాని, ఈ అవకాశాన్ని ఇప్పటి వరకు బౌలింగ్ టీమ్ లేదా, బ్యాటింగ్ చేస్తున్నవారు మాత్రమే ఉపయోగించుకున్నారు. కాని, హైదరాబాద్ వర్సెస్ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ ఈ డీఆర్ఎస్ను ఉపయోగించుకున్నారు.
ఓ కరెక్ట్ డెసిషన్ కోసం ఇలా డీఆర్ఎస్ వాడుకోవడంలో తప్పేం లేదు. కాని, ఏ సందర్భానికి ఉపయోగించుకున్నాడన్నదే ముఖ్యం. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అర్జున్ వేసిన నాలుగో బాల్.. త్రిపాఠి పక్క నుంచి లెగ్‌స్టంప్ అవతల నుంచి వెళ్లింది. అయితే అర్జున్ టెండూల్కర్‌తో పాటు కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్‌ఔట్ అంటూ అప్పీల్ చేశారు. కానీ అంపైర్ వైడ్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రివ్యూ తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అర్జున్, ఇషాన్‌లు సైలెంట్ అయిపోయారు. ఏమైందో తెలియదు గానీ నితిన్ మీనన్ తొలిసారి అంపైర్ రివ్యూను ఉపయోగించాడు. అసలు అది వైడ్ బాల్ అవునా కాదా అనే డౌట్‌తో రివ్యూకు వెళ్లాడు.
ఒక వైడ్ బాల్‌కు డీఆర్ఎస్ కోరడం ఏంటని నెటిజన్లు తెగ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ మాత్రం కూడా గమనించలేకపోయారా అని. అది నిజంగా వైడ్ బాల్ అయింది కాబట్టి విమర్శిస్తున్నారు గానీ.. ఒకవేళ అది ఔట్ అయి ఉంటే గనక.. కచ్చితంగా అంపైర్ నిర్ణయాన్ని మెచ్చుకునే వాళ్లు. అయినా.. డీఆర్ఎస్ ఆప్షన్ ఉన్నదే ఉపయోగించుకోడానికి. అలాంటిది, అంపైర్ నితిన్ నిర్ణయాన్ని తప్పుపట్టడం దేనికి?