EPAPER

Congress: పీసీసీ చీఫ్‌కు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు.. నమ్మాల్సిందే మరి..

Congress: పీసీసీ చీఫ్‌కు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు.. నమ్మాల్సిందే మరి..
Congress

Congress: కోటి ఉంటేనే కోటీశ్వరుడు అంటారు. అలాంటిది పదులు, వందల కోట్లు ఉన్నవారిని చూస్తే అంతా అవాక్కవుతుంటారు. వారి గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు. అంబానీ, అదానీ లాంటి బిజినెస్‌మెన్ దగ్గర భారీ సంపద ఉండటం ఆశ్చర్యకరమేమీ కాదు. కానీ, రాజకీయ నాయకులు కోట్లకు కోట్లు పోగేస్తుండటమే చర్చనీయాంశం. అయితే, అందరు పొలిటిషియన్స్ ఒకేలా ఉండరు. కొందరు అక్రమార్జనతో ధనవంతులు అయితే.. మరికొందరు మాత్రం మొదటి నుంచీ సంపన్నులుగానే ఉన్నారు. రాజకీయాలతో పాటు వ్యాపార సామ్రాజ్యాన్నీ ఏలుతున్నారు. అలాంటి వారిలో కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఒకరు.


కాంగ్రెస్ నేతల్లోకెళ్లా రిచెస్ట్ లీడర్ డీకే శివకుమార్. ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో. ఆయన బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ మరి. తాజాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. అప్పటి నుంచీ ఆయన సంపద గురించి మరోసారి చర్చ.

మొత్తం తన ఆస్తుల విలువ రూ.1,139 కోట్లు అని ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపారు డీకే. ఆస్తులే కాదు అప్పులూ భారీగానే ఉన్నాయ్ ఆయనకు. 263 కోట్ల అప్పులు ఉన్నట్టు చూపించారు.


అంత ఆస్తి ఉన్నాయనకు బంగారం, కార్లకు కొదవేముంటుంది. కానీ, తన దగ్గర ఒకేఒక కారు ఉన్నట్టు వెల్లడించారు శివకుమార్. రెండు ఖరీదైన వాచ్‌లు ఉన్నాయట. ఇక, గోల్డ్ మాత్రం బాగానే కొన్నారు. 2 కేజీల బంగారం, 12 కేజీల వెండి ఉన్నట్టు తెలిపారు కన్నడ పీసీసీ చీఫ్.

ఆస్తులు, అప్పులే కాదు.. కేసులూ ఎక్కువే. తనపై 19 కేసులు ఉన్నాయని.. వాటిలో 13 కేసులు గత మూడేళ్లలోనే నమోదైనట్టు అఫిడవిట్‌లో మెన్షన్ చేశారు.

అయితే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలిపిన వివరాలతో పోలిస్తే.. ఈ ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ ఏకంగా 67 శాతానికిపైగా పెరగడం విశేషం. అందుకే అంటారు డీకేనా మజాకా. ఈసారి కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్యతో పోటీపడుతున్నారు శివకుమార్.

ఇక, డీకే శివకుమార్ కంటే కూడా బీజేపీ అభ్యర్థి ఎంటీబీ నాగరాజ్ మరింత ఆస్తిపరుడిగా నిలిచాడు. ఆ బీజేపీ నేత ఆస్తుల విలువ.. రూ.1,607 కోట్లు అని అఫిడవిట్‌లో తెలిపాడు. అటు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న షాజియా తర్రానుమ్.. అందరికంటే ఎక్కువగా రూ.1,629 కోట్లతో టాప్‌లో ఉన్నారు.

మే 10న ఒకే విడతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 13న కౌంటింగ్ అండ్ రిజల్ట్స్.

Related News

India – Canada : ఏకంగా అమిత్ షా పై టార్గెట్.. భారత్ రియాక్షన్ మామూలుగా లేదుగా

Priyanka Gandhi: మీకు నేనున్నా.. బీజేపీపై నిప్పులు చెరిగిన ప్రియాంకగాంధీ

PM Modi: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి, ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం!

Bengaluru Man Dies: చావు తెచ్చిన ఛాలెంజ్.. క్రాకర్ పై కూర్చొన్న యువకుడు.. క్షణాల్లో మృతి

MiG-29 Fighter Jet Crashes: ఆగ్రా సమీపంలో కూలిన జెట్ విమానం.. ఎగిసిపడ్డ అగ్ని కీలలు.. పైలట్లు సేఫ్

Stalin Thalapathy Vijay: విజయ్ కొత్త పార్టీపై సెటైర్ వేసిన సిఎం స్టాలిన్.. ఆ ఉద్దేశంతోనే రాజకీయాలు అని ఎద్దేవా

Jammu Kashmir Assembly: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల గొడవ.. తొలి సమావేశంలోనే ఆర్టికల్ 370పై మాటల యుద్ధం

Big Stories

×