EPAPER

Scientists:- ఆహారంలో ఇమ్యూన్ సిస్టమ్‌ను దెబ్బతీసే బ్యాక్టీరియా..

Scientists:- ఆహారంలో ఇమ్యూన్ సిస్టమ్‌ను దెబ్బతీసే బ్యాక్టీరియా..

Scientists:- ఈరోజుల్లో తినే ఆహారంలో కూడా బ్యాక్టీరియా అనేది ఎక్కువయిపోతోంది. కంటికి కనిపించని ఎన్నో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లాంటివి ఎక్కువగా తినే ఆహారం ద్వారానే మనిషి శరీరంలోకి ఎంటర్ అవుతున్నాయి. అందుకే అలాంటి సమస్యలను దూరం చేయడానికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా తినే ఆహారం వల్ల ఏర్పడే ఒక మానసిక సమస్యను ఎలా ఎదుర్కోవాలో శాస్త్రవేత్తలు కనిపెట్టినట్టు తెలుస్తోంది.


సాల్మొనెల్లా అనే ఒక బ్యాక్టీరియా మనం తరచుగా తినే మాంసం, గుడ్లు, పాలకు సంబంధించిన పదార్థాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీని వల్ల మనుషుల్లో గ్యాస్‌కు సంబంధించిన సమస్యలతో పాటు టైఫాయిడ్ లాంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి. అంతే కాకుండా ఈ బ్యాక్టీరియా మనుషుల్లోని ఇమ్యూన్ సిస్టమ్‌ను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. శరీరంలోని మ్యాక్రోఫేజెస్ (అంటే ఇన్ఫెక్షన్స్‌ను ఎదిరించే సెల్స్)పై ఈ బ్యాక్టీరియా ప్రభావం చూపిస్తుంది. సాల్మొనెల్లాలో ఉండే సాప్‌బీ అనే ప్రొటీనే వీటికి కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు.

సాల్మొనెల్లా గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో రకాల టెక్నాలజీలను ఉపయోగించారు. మాలిక్యూలర్ బయోలజీ, బ్యాక్టీరియల్ సిస్టమ్స్ ద్వారా దీనిని స్టడీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సాల్మొనెల్లా వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్న వారు చాలామంది ఉన్నారు. వారికి చికిత్స కూడా అందుతోంది. కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా లేనివారిపై మాత్రం సాల్మొనెల్లా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాంటి వారిలో చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారని వారు తెలిపారు.


ప్రస్తుతం శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో సాల్మొనెల్లా అనేది మనిషి ఇమ్యూన్ సిస్టమ్‌ను ఏ విధంగా దెబ్బతీస్తుందనే విషయం బయటపడనుంది. దీని ద్వారా కొత్త కొత్త చికిత్సా విధానాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. సాల్మొనెల్లాను ఎదిరించడానికి లైసోసోమ్స్ బెస్ట్ ఆప్షన్ అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. లైసోసోమ్స్ అనేవి సాల్మొనెల్లా వల్ల ఏర్పడే సాప్‌బీ ప్రొటీన్‌ను ఎదిరించడానికి ఉపయోగపడుతుందని, ప్రస్తుతం ఇదే మెరుగైన చికిత్స విధానమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈరోజుల్లో ఆహారం వల్ల పెరిగే అనారోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. దీని వల్ల పరోక్షంగా ఎకానమీపైన కూడా దెబ్బపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా అభివద్ధి చెందని, చెందుతున్న దేశాల్లోనే ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే ఆ దేశాల్లోనే ఇంకా ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ అనేది పూర్తిస్థాయిలో ప్రతీ ఒక్కరికి అందుబాటులో లేదు కాబట్టి అని వారు తెలిపారు. అందుకే ఇలాంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్ అవసరమన్నారు.

Tags

Related News

Motorola Razr 50 Ultra : ఇచ్చిపడేసిన అమెజాన్.. తాజాగా లాంఛ్ అయిన ఫోన్ పై ఏకంగా రూ.45వేల డిస్కౌంట్

Whats App Reverse Search Image : క్లిక్ కొట్టు.. ఫేక్ ఫోటో పట్టు.. అలరించబోతున్న వాట్సాప్ కొత్త ఫీచర్

Scientists : మానవ జాతి ఎలా అంతం కాబోతుందో చెప్పిన శాస్త్రవేత్తలు.. ఇది చదివితే సగం చచ్చిపోతాం

iQOO Neo 10 Pro : అదిరే ఐక్యూ మెుబైల్.. 6000mAh బ్యాటరీ, 512GB స్టోరేజీ.. ఇంకేం ఫీచర్స్ ఉన్నాయంటే!

Upcoming Mobiles In Nov 2024 : నవంబర్లో రానున్న స్మార్ట్ ఫోన్స్ లో టాప్ 4 ఇవే.. దిమ్మతిరిగే ఫీచర్స్, అదిరిపోయే హైలెట్స్ గురూ!

iPhone Safety : మళ్లీ పేలిన ఐఫోన్.. మహిళకు తీవ్ర గాయాలు.. స్పందించిన యాపిల్ ఏమన్నాదంటే!

Best Smart Phones List 2024 : ధరతో పాటు ఫీచర్స్ కెవ్వుకేక.. తాజాగా లాంఛ్ అయ్యి దూసుకుపోతున్న బెస్ట్ మెుబైల్స్ ఇవే!

Big Stories

×