India:- ఎక్స్‌పోర్ట్స్‌లో రికార్డ్స్ అంటే ఇండియావే. మొన్న 750 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది భారత్. ఇప్పుడు మెడిసిన్స్ ఎగుమతుల్లోనూ సత్తా చాటింది. రూ.2.08 లక్షల కోట్ల ఔషధ ఎగుమతులు చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
నిజానికి యూరప్ దేశాలన్నీ సంక్షోభంలో ఉన్నాయి. మందులపై ఖర్చును ఆ దేశాలు విపరీతంగా తగ్గించుకున్నాయి. అమెరికాలోనూ ఇదే పరిస్థితి. పైగా మిగతా టీకాలు, మందుల కంటే కూడా కరోనా వ్యాక్సిన్ తయారీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాయి ఇండియన్ ఫార్మా కంపెనీలు. అయినా సరే.. రికార్డ్ స్థాయి ఎగుమతులు ఎలా సాధ్యమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ వార్, యూరప్ క్రైసిస్… భారత ఫార్మా ఎగుమతులను ఎందుకు అడ్డుకోలేకపోయాయి? కారణం.. కొత్త మార్కెట్లను వెతకడమే.
అమెరికాతో పాటు ఆఫ్రికా దేశాలు, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్‌లో ఫార్మా ఎగుమతులు పెంచుకున్నాయి ఇండియన్ కంపెనీలు. దీంతో పాటు కొన్ని కొత్త మందులను అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో అమ్మడానికి భారతీయ కంపెనీలు అనుమతులు పొందాయి. ఓవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నా.. ఉజ్బెకిస్థాన్, బెలారస్, అర్మేనియా, కిర్గిజ్‌స్థాన్, కజఖ్‌స్థాన్, అజర్‌బైజాన్, తజికిస్థాన్, మల్దోవా) దేశాలకు సైతం ఇండియా మందులు ఎక్కువగా ఎగుమతి చేస్తోంది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఔషధాల ఎగుమతులకు గుడ్ కండీషన్స్ లేకపోయినా సరే… ఇండియన్ కంపెనీలు సత్తా చాటాయి.
ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్- ఫార్మాగ్జిల్ గణాంకాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇండియా దాదాపు రూ.2.08 లక్షల కోట్ల ఔషధాలను ఎగుమతి చేసింది. అదే 2021-22 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2.02 లక్షల కోట్ల మందులను ఎగుమతి చేసింది. అంటే, 3.25% వృద్ధి కనిపించింది.