Mohit Sharma : మోహిత్ శర్మ.. ఈ రైట్ హ్యాండ్ బౌలర్‌కు మంచి టాలెంటే ఉన్నా ఎందుకనో అవకాశాలు మాత్రం సరిగ్గా రాలేదనే చెప్పాలి. 2014 ఐపీఎల్ సీజన్‌లో పర్పుల్ క్యాప్ హోల్డర్. 2015 వరల్డ్ కప్ సెమీ ఫైనలిస్ట్. అయినా సరే.. మోహిత్‌ను తగిన రీతిలో ఉపయోగించుకోలేదనిపిస్తుంది.
ఆన్ పేస్ డెలివరీస్, ఆఫ్ పేస్, ఆఫ్ కట్టర్ బాల్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే మోహిత్ శర్మ ఎందుకనో ఐపీఎల్‌లో కూడా సరిగా కంటిన్యూ అవలేదు. అసలు ఏమైంది ఏమైంది మోహిత్ శర్మకు.
2013 సీజన్‌తో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన మోహిత్ శర్మ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలకమైన స్పెల్ వేశాడు. ఆ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 86 పరుగులు తేడాతో గెలిచింది. మోహిత్ శర్మ ఆ మ్యాచ్‌లో 10 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. 2013 సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన మోహిత్.. 20 వికెట్లు తీసి టోటల్ ఐపీఎల్‌లోనే సెకండ్ బెస్ట్ బౌలర్ అనిపించుకున్నాడు.
2014 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ మోహిత్ కెరీర్‌కే హైలెట్. 14 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో 160 పరుగులకు పైగా స్కోర్ చేయాల్సిన ముంబై ఇండియన్స్‌ను 140కే కట్టడి చేశాడు. ఒకే ఓవర్ లో వరుసగా పొలార్డ్, అంబటి రాయుడు, హర్భజన్ వికెట్లు తీసి జట్టును దెబ్బ తీశాడు. ఆ సీజన్‌లో పర్పుల్ క్యాప్ మోహిత్ శర్మకే. మొత్తం 23 వికెట్లు తీసి అదరహో అనిపించాడు.
2016లో రైజింగ్ పుణెతో జరిగిన మ్యాచ్‌లోనూ 23 పరుగులు ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. అలాంటి మోహిత్ శర్మ.. 2019 సీజన్‌లో ఒకే మ్యాచ్ ఆడాడు. 2020లోనూ ఒకే మ్యాచ్.
తిరిగి ఈ సీజన్‌లో అడుగుపెట్టాడు. ఆడింది ఒక మ్యాచే అయినా 2 కీలక వికెట్లు తీశాడు. ప్రస్తుతం గుజరాత్ టైటన్స్ జట్టులో ఉన్న మోహిత్‌కు ఈ సీజన్‌లో అయినా ఎక్కువ అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.