EPAPER

Vishaka Steel: కేసీఆర్‌కు షాక్.. విశాఖ ఉక్కుపై కేంద్రం పొలిటికల్ గేమ్..

Vishaka Steel: కేసీఆర్‌కు షాక్.. విశాఖ ఉక్కుపై కేంద్రం పొలిటికల్ గేమ్..
KCR vishaka Steel plant

Vishaka Steel: ఉదయం ప్రైవేటీకరణ లేదన్నారు. సాయంత్రం కన్ఫ్యూజ్ చేసేలా మాట్లాడారు. మర్నాడు మళ్లీ మొదటికొచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం త్రిబుల్ గేమ్ ఆడుతోంది. కేంద్రమంత్రి ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించి.. తాత్కాలికంగా ప్రైవేటీకరణను ఆపేశామని చెప్పారు. సడెన్‌గా కేంద్ర వైఖరి మారడంపై అంతా ఆశ్చర్యపోయారు.. కేంద్ర నిర్ణయాన్ని హర్షించారు.


కేంద్రమంత్రి ఇలా అన్నారో లేదో.. బీఆర్ఎస్ పొలిటికల్ అడ్వాంటేజ్ స్టార్ చేసింది. కేసీఆర్ దెబ్బకి కేంద్రం దిగొచ్చిందంటూ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఊదరగొట్టారు. ఏపీలోని పార్టీలు వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. ఆ కామెంట్స్ వైసీపీకి ఆగ్రహం తెప్పించింది. మాజీ మంత్రి పేర్నినాని బీఆర్ఎస్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మధ్యలో బీజేపీ దూరింది. ఆ క్రెడిట్ తమదేనని గొప్పలకు పోయింది.

కట్ చేస్తే.. అంతా తూచ్ అంటూ కేంద్రం నుంచి క్లారిటీ వచ్చింది. ఢిల్లీ స్థాయిలో ఏం జరిగిందో ఏమోగానీ.. కేంద్రమంత్రి స్వయంగా చెప్పిన మాటలు తప్పంటూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదంటూ.. ఉక్కు మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ RINLలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కంటిన్యూ అవుతోందని క్లారిటీ ఇచ్చింది. ప్రైవేటీకరణ ప్రక్రియను నిలుపుదల చేసినట్లు వస్తున్న వార్తలను కేంద్ర ఉక్కుశాఖ ఖండించింది. బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్ అవుతుందని అనుకుందో ఏమో.. 24 గంటల్లోనే కేంద్రం తన వైఖరి మార్చుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రకటనపై కార్మికుల సంఘాలు భగ్గుమంటున్నాయ్‌. మరో పోరాటానికి సన్నద్ధం అవుతున్నాయ్‌.


మరోవైపు, బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌కు స్వాగతం పలుకుతూ విశాఖ గాజువాకలో ఏర్పాటు చేసిన జెండాలను బీజేపీ నాయకులు తీసేసి నిరసన తెలిపారు. బీజేపీ తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు గాజువాకలో ఆందోళనకు దిగారు. ఇలా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎపిసోడ్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్‌గా మారడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఏపీలోని ప్రధాన పార్టీలు ఈ విషయంలో గమ్మునుంటూ.. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టో?

Related News

CM Chandrababu meet PM Modi: ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు గంటపాటు భేటీ, చివరలో లడ్డూ వ్యవహారం కూడా?

IPS Sunilkumar: ఏపీలో మరో ఐపీఎస్‌కు కష్టాలు, సునీల్ కుమార్‌కు కేవలం 15 రోజులే మాత్రమే..

Divvala Madhuri: పెళ్లంటూ ప్రకటించిన కొద్ది క్షణాలకే.. మరో వివాదంలో దివ్వెల మాధురీ.. అదే నిజమైతే..!

Pawan Kalyan: పవన్‌కు కొత్త శత్రువులు.. కేసుల మీద కేసులు పెడుతోన్న జనసైనికులు, ఇక వారికి చుక్కలే!

Dussehra Special Trains: దసరా, దీపావళికి ఊరెళ్తున్నారా? 800 స్పెషల్ ట్రైన్స్ సిద్ధం, వెంటనే టికెట్ బుక్ చేసుకోండి

Vijayawada: పేకాట ఆడిన ఖాకీ బాస్ లు.. వీడియో వైరల్.. తెగ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్

AP Govt: మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇక ఆ సాయం రెట్టింపు..

×