EPAPER
Kirrak Couples Episode 1

Post office:- బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న పోస్టాఫీసులు.. ఎఫ్‌డీల్లో బ్యాంకులు ఇస్తున్న ఆప్షన్లేంటి?

Post office:- బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్న పోస్టాఫీసులు.. ఎఫ్‌డీల్లో బ్యాంకులు ఇస్తున్న ఆప్షన్లేంటి?

Post office:- సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్ బ్యాంక్ డిపాజిట్లే. వచ్చే వడ్డీ తక్కువే అయినా.. పెట్టుబడికి రక్షణ ఉంటుంది. కాని, పెట్టుబడికి రక్షణ ఉంటూనే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఇన్‌స్ట్రుమెంట్ మరొకటి ఉంది. అదే.. పోస్టాఫీస్ టైం డిపాజిట్.


స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి గ్యారెంటీ రిటర్న్స్ ఉండవు. కాని, లాభాలు వస్తే మాత్రం మరే డిపాజిట్ స్కీమ్ ఇవ్వలేనంత ఇస్తుంది. గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్ ఊగిసలాడుతుండడంతో.. ఇన్వెస్టర్లు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు చూస్తున్నారు. పైగా ఈ మధ్య బ్యాంకులు కూడా డిపాజిట్ రేట్లను బాగానే పెంచాయి. కస్టమర్ల నుంచి డిపాజిట్స్ పెంచుకోడానికి, ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఇంట్రస్ట్ రేట్స్ పెంచాయి బ్యాంకులు. దీంతో పోస్టాఫీసులో పెడదామనుకున్న ఇన్వెస్టర్లందరూ.. బ్యాంకుల వైపే వెళ్లారు. పోటీని తట్టుకునేందుకు పోస్టాఫీస్ కూడా టైమ్ డిపాజిట్స్ రేట్లను సవరించాయి.

బ్యాంక్ లేదా పోస్టాఫీస్.. ఈ రెండు సీనియర్‌ సిటిజన్లకు ఎక్కువ ప్రయోజనాలు అందిస్తున్నాయి. మిగిలిన వారితో పోల్చితే సీనియర్ సిటిజన్స్‌కు 0.5 నుంచి 0.75 శాతం ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి. కానీ, పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్లలో మాత్రం అన్ని వయసుల వారికీ ఒకే రకమైన వడ్డీరేటు ఉంటోంది. కాని, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. బ్యాంకుల ఫిక్స్డ్ రేట్లతో పోలిస్తే పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్ల వడ్డీరేటు ఎక్కువగానే ఉంది. అలాగే, కొన్ని ప్రైవేట్‌ బ్యాంకులు పోస్టాఫీస్‌ కంటే ఎక్కువ వడ్డీరేటును ఇస్తున్నాయి.


బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ పెడితే.. ఆర్‌బీఐ రెపోరేటుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు ఉండొచ్చు. అదే పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్లలో మాత్రం ప్రతి మూడు నెలలకోసారి సవరణలు ఉండే అవకాశం ఉంది.

పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్లలో కనిష్ఠంగా ఒక సంవత్సరం నుంచి గరిష్ఠంగా ఐదు సంవత్సరాల కాలపరిమితితో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయొచ్చు. బ్యాంక్ ఎఫ్‌డీల్లో అయితే కనిష్ఠంగా ఏడు రోజులు.. గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు డిపాజిట్‌ చేసే అవకాశం ఉంటుంది. కాలపరిమితి పరంగా చూస్తే బ్యాంక్ ఎఫ్‌డీల్లో ఎక్కువ ఆప్షన్లు ఉన్నాయి.

Tags

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×