Good cause :- ఏదైనా శుభకార్యానికి వెళ్లేటప్పుడు ముగ్గురు కలిసి వెళ్లకూడదంటారు. ఈ మాట ఎన్నాటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. సంప్రదాయలను, పద్దతులు, ఆచారాలు పాటించే వాళ్లు దీన్ని బాగా నమ్ముతుంటారు. ముగ్గురు కలసి శుభ కార్యక్రమాలకు కలసి వెళ్ళ కూడదు అని అన్నారు కాబట్టి నలుగురు వెళితే సరిపోతుంది లేదా ముందు ఇద్దరు వెళతారు కాస్త వెనుకగా మరొకరు వెళతారు.. శుభ కార్యక్రమాలకు ముగ్గురు కలసి ప్రయాణం చేయరాదు అని మన పెద్దలు చెప్పారు.
పూర్వం ఇప్పటిలా ప్రయాణ సదుపాయాలు ఉండేవి కావు. ఒక ఊరి నుండి మరొక ఊరికి ఒంటరిగా గాని జంట గా గాని ఆహార పదార్ధాలు మూటగట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ కాలి నడకన కొండలు కోనలు దాటుకుంటూ వెళ్ళే వారు.. దారిలో నిధి నిక్షేపాలు లేదా ఏమైనా దొరికితే కలసి పంచుకునేవారు…. స్నేహం గా మాట్లాడుకొని వెళ్ళే వారు… ఏ రహస్యమైన ఇద్దరి మధ్యే ఉండేది…
అలా కాక ముగ్గురు కలసి ప్రయాణం చేయవలసిన సందర్భం లో మాట పట్టింపులు ఎక్కువగా వచ్చి ఒకరితో ఒకరు విభేదించి గొడవ పడే అవకాశాలు ఎక్కువగా ఉండేవి.
నిధి నిక్షేపాలు దొరికినప్పుడు ముగ్గురైతే పంపకాల మధ్య తేడాలు వచ్చి గొడవలు పడేందుకు అవకాశం ఉంటుంది. పంపకాలు ఇష్టం లేని వ్యక్తి ఆ సొమ్ము ప్రభుత్వానికే చెందాలి అని భావించి ఈ ఇద్దరికీ తెలియకుండా పోలీసులకి సమాచారం ఇవ్వ వచ్ఛు. అలా అని ఏదైనా విషయం రహస్యంగా దాచుదామంటే ఆ విషయం రహస్యంగా ఉండేది కాదు. ఏదైనా రహస్యం ఇద్దరి మధ్యే ఉండాలన్న మాట అనడం మనకు తెలుసు. మూడో వ్యక్తి కి తెలియ కూడదు’ అని కారణం ఆ మూడో వ్యక్తి ఉంటే ఆ అతి రహస్యం కాస్తా బట్టబయలవుతుంది. ఈ విధమైన అసౌకర్యాలు ఉన్నాయి కాబట్టే… మన పెద్దలు ముగ్గురు కలసి ప్రయాణం చేయద్దని ముందు చూపుతో అన్నారు.