EPAPER
Kirrak Couples Episode 1

Shani Bhagavan : శనిభగవానుడికి ఎదురుగా నిలబడకూడదా….?

Shani Bhagavan : శనిభగవానుడికి ఎదురుగా నిలబడకూడదా….?
Shani Bhagavan

Shani Bhagavan : శనిభగవానుడిని నమస్కరించే సమయాల్లో ఆయనకు ప్రత్యక్షంగా గాకుండా పక్కకు నిలబడి నమస్కరించడం చేయాలని చెబుతున్నారు. ఏదైనా ఆలయంలో నవగ్రహాలను 9సార్లు ప్రదక్షిణ చేసి, అనంతరం శనిగ్రహానికి నేరుగా నిలబడి తలవంచి నమస్కరించడం కూడదు. శనిగ్రహం మనల్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు నమస్కరిస్తే.. శనిగ్రహ ప్రభావంచే దుష్పలితాలు తప్పవని పండితులు అంటున్నారు.


నవగ్రహ ప్రదక్షణ చేసేటప్పుడు ఏ గ్రహాన్ని ముట్టుకోకూడదు. చేతితో ఏ విగ్రహాన్ని తాకకుండా ప్రదక్షణ చేయాలి. అప్పుడే నవగ్రహాలతో కలిగే దుష్ఫలితాల ప్రభావం తగ్గిపోతుంది. ముఖ్యంగా శనిగ్రహానికి నేరుగా నిలబడి నమస్కరిస్తే అశుభఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. నవగ్రహాల్లో శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పూర్వం శ్రీలంకను పరిపాలించిన రావణాసురుడు తన బలపరాక్రమాలతో దేవతలను, నవగ్రహాలను జయించాడు. నవగ్రహాలను తొమ్మిది మెట్లుగా చేసి, వాటిపై నడవటం చేశాడు. దీన్ని గమనించిన నారదమహాముని రావణాసురుడి అహంకారానికి నిర్మూలించాలని భావించాడు.

ఈ క్రమంలో ఓ రావణాసురా.. నీవు నిజమైన బలపరాక్రమశాలి అయితే నవగ్రహాలను బోల్తాపడేసి నడిచిపోవడం గాకుండా.. వారిని సాష్టాంగ పడుకోబెట్టి మెట్లుగా ఉపయోగించుకోవచ్చు కదా..! అన్నాడు. నారదుని మాట విన్న రావణాసురుడు నవగ్రహాలను బోల్తా పడుకోబెట్టకుండా తనవైపు చూసేలా పడుకోబెట్టి మెట్లుగా ఉపయోగించుకున్నాడు. రావణాసురుడు ప్రత్యక్షంగా శనిగ్రహాన్ని చూడటం ద్వారా అప్పటినుంచి చెడుకాలం ఆరంభమైంది. ఇది జరిగిన తర్వాతే రామునిచే రావణాసురుడు హతుడయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి శనిభగవానుడిని నమస్కరించే సమయాల్లో ఆయనకు ఎదురుగా కాకుండా పక్కకు నిలబడి నమస్కరించడం చేయాలని పురోహితులు చెబుతున్నారు.


Related News

Navaratri 2024: నవరాత్రుల్లో ఉపవాసం ఎందుకు ఉండాలి ? దీని వెనక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటి

Navratri 2024 rashifal: నవరాత్రి నాడు షష్ రాజ యోగం.. ఈ రాశులపై సంవత్సరమంతా లక్ష్మీ దేవి ఆశీర్వాదం

Surya Grahan 2024: నేడే చివరి సూర్య గ్రహణం.. వీరు జాగ్రత్తగా ఉండాలి

Horoscope 2 october 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయాన్ని మించిన ఖర్చులు!

Engilipoola Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ వచ్చేసింది, పువ్వులు ఎలా ఎంగిలి అవుతాయో తెలుసుకోండి

Navaratri 2024: నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సుల కోసం ఏ రంగు దుస్తులు ధరించాలొ తెలుసా ?

Lucky Zodiac Signs: అక్టోబర్‌లో వీరు పట్టిందల్లా బంగారమే !

Big Stories

×