EPAPER

Samantha : రీల్ శాకుంతలం.. రియల్ క్వీన్.. సామ్ చెప్పిన క్రేజీ థింగ్స్..

Samantha : రీల్ శాకుంతలం.. రియల్ క్వీన్.. సామ్ చెప్పిన క్రేజీ థింగ్స్..

Samantha : సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతలం మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అలాగే సినిమా యూనిట్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. సినిమాపై ఆసక్తికర విషయాలు వెల్లడిస్తోంది. తాజాగా సమంత శాకుంతలం మూవీపై ఇన్‌స్టాగ్రామ్ లో 5 క్రేజీ థింగ్స్‌ షేర్ చేసింది. సామ్ చెప్పిన విశేషాలు ఇవే..


*సమంతకు పూలు అంటే ఎలర్జీ. ఈ సినిమాలో చేతికి, మెడకి పూలు చుట్టుకున్నప్పు దద్దుర్లు వచ్చాయి. ఆ దద్దుర్లు టాటూల మాదిరిగా 6 నెలలు అలాగే ఉండిపోయాయి. మేకప్ తో ఆ దద్దుర్లు కవర్ చేశారు.

*తన పాత్రకు సమంత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్‌ చెప్పింది. సామ్ నిద్రలోనూ డైలాగులను కలవరించేదట.


*సినిమా షూటింగ్‌ సెట్ లో చాలా కుందేళ్లు ఉండేవి. అందులో ఒక కుందేలు సమంతను కరిచింది. ఆ కుందేలు క్యూట్‌గా లేదని చెప్పింది.

*ఈ సినిమాలో ఒక పాటలో సామ్ ధరించిన లెహెంగా బరువు 30 కేజీలు. దీంతో సామ్ చాలా ఇబ్బంది పడింది. చుట్టూ తిరిగినప్పుడు ఆ లెహెంగా బరువుకు సామ్‌ ఫ్రేమ్‌ నుంచి పక్కకు వెళ్లడంతో.. కెమెరా మ్యాన్ గట్టిగా అరిచేవాడట. ‘నేను వెళ్లడం లేదు.. లెహంగానే నన్ను లాక్కుని వెళ్తోంది’ అని సమంత కూడా గట్టిగానే సమాధానం ఇచ్చేదట.

*‘శాకుంతలం’లో కనిపించే జుట్టు సమంత ఒరిజినల్‌ జుట్టు కాదు. ఈ విషయాన్ని సామ్ వెల్లడించింది. ఇలా ఆసక్తికర విషయాలు చెప్పిన సమంతపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సామ్‌ రియల్‌ క్వీన్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Related News

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Big Stories

×