EPAPER

Asteroids:- ఖరీదైన ఖనిజాల కోసం ఆస్ట్రాయిడ్స్ మైనింగ్..

Asteroids:- ఖరీదైన ఖనిజాల కోసం ఆస్ట్రాయిడ్స్ మైనింగ్..

Asteroids:- మైనింగ్ అనేది ఎంతో రిస్క్‌తో కూడుకున్న వృత్తి. భూమి లోపల ఉండే ఖనిజాల గురించి తెలుసుకోవడానికి, వాటితో వ్యాపారం చేయడానికి ఈ మైనింగ్ అనేది మొదలయ్యింది. ప్రస్తుతం ఈ మైనింగ్ రంగం కొంచెం ప్రభుత్వం చేతిలో ఉంటే.. మరికొంత ప్రైవేట్ సంస్థల చేతిల్లో ఉంది. అయితే భూమిలోపల మైనింగ్ చేసినట్టు ఆకాశంలో ఎందుకు చేయకూడదు అనే ఆలోచన శాస్త్రవేత్తలకు వచ్చింది. ఇప్పుడు అలాంటి మైనింగ్ కోసమే ఒక స్టార్టప్ కూడా ప్రారంభమయ్యింది.


ఆస్ట్రోఫోర్జ్ అనే సంస్థ ప్రత్యేకంగా ఆస్ట్రాయిడ్స్‌ను మైనింగ్ చేయడానికి ప్రారంభమయ్యింది. ఇప్పటికే స్పేస్‌లో మైనింగ్ చేయాలనే ఆలోచన చాలామంది శాస్త్రవేత్తలకు వచ్చింది. కానీ దానికి తగిన సదుపాయాల కోసం వారు ఎదురుచూస్తూ ఉండిపోయారు. కానీ ఈ ప్రైవేట్ సంస్థ మాత్రం కచ్చితంగా ఆస్ట్రాయిడ్స్‌ను మైనింగ్ చేసి చూపిస్తామంటోంది. ఆస్ట్రాయిడ్స్‌ను మైనింగ్ చేయడం వల్ల వచ్చే పదార్థాలను అమ్మి కమర్షియల్ రూటులో వెళ్లాలని ఈ సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆస్ట్రాయిడ్స్‌ను మైనింగ్ చేసి క్యాష్ చేసుకోవాలనుకునే ఆలోచన ఆస్ట్రోఫోర్జ్‌కు ఇప్పుడు కాదు ఎప్పుడో వచ్చింది. అప్పటినుండి ఈ దిశగా ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఒక్క ప్రయత్నం కూడా సక్సెస్ అవ్వలేదు. దీంతో పెట్టుబడిదారులు కూడా వెనక్కి తగ్గడం మొదలుపెట్టారు. అందుకే భవిష్యత్తులో చేసే ప్రయత్నాలు విఫలం కాకూడదని ఆస్ట్రోఫోర్జ్ బలంగా నిర్ణయించుకుంది. వెంటనే ఒక టెస్ట్ మిషిన్‌ను లాంచ్ చేసి ఆస్ట్రాయిడ్స్ మైనింగ్ కలను నిజం చేసుకోవాలనుకుంటోంది.


త్వరలోనే ఒక టెస్ట్ ఫ్లైట్‌ను ఆకాశంలోకి పంపించనుంది ఆస్ట్రోఫోర్జ్. ఈ ఫ్లైట్ స్పేస్‌లో ఉండే రాళ్లను, ఆస్ట్రాయిడ్స్‌ను దగ్గరుండి స్టడీ చేయనుంది. ఈ స్టడీ వారి మైనింగ్‌కు ఎంతగానో ఉపయోగపడనుంది. 2021లో ఆస్ట్రాఫోర్జ్ అనేది ప్రారంభమయ్యింది. అప్పటినుండి ఇప్పటివరకు విరామం లేకుండా ఆస్ట్రాయిడ్స్ మైనింగ్‌పైనే ఈ సంస్థ ఫోకస్ ఉంది. ఇప్పటికే ఈ లక్ష్యంతో ప్రారంభమయిన ఎన్నో కంపెనీలు వెనుదిరిగాయి. కానీ ఆస్ట్రోఫోర్జ్ మాత్రం ఈ రంగంలో కొత్త రికార్డ్ సాధించాలని పాటుపడుతోంది.

Tags

Related News

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Big Stories

×