EPAPER

Xenobots:- కప్ప సెల్స్‌తో తయారు చేసే గ్జెనోబోట్స్..

Xenobots:- కప్ప సెల్స్‌తో తయారు చేసే గ్జెనోబోట్స్..

Xenobots:- రోబోటిక్స్ అనేది ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్పీడ్‌గా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటి. కొత్త కొత్త రోబోలను తయారు చేయడంతో పాటు వాటిని మనుషులకు దగ్గర చేసే ప్రయత్నంలో పూర్తిగా నిమగ్నమయి ఉన్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే ఎన్నో రంగాల్లో మనుషులతో సమానంగా రోబోలు కూడా పనిచేయడం మొదలుపెట్టాయి. అయితే రోబోల తయారీలో కూడా కొత్త రికార్డులు సృష్టించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


రోబో అనగానే చాలామందికి చెప్పింది చేసే ఒక యంత్రం లాగానే అనిపిస్తుంది. మనం చెప్పిన మాటలు వింటూ, మనం చెప్పింది చెప్పినట్టుగా చేసే ఒక యంత్రం. ఒక్కొక్కసారి ఈ యంత్రం మనతో మాట్లాడుతూ, మనకు మంచి తోడుగా కూడా ఉంటుంది. అంతే కాకుండా ఒక్కొక్కసారి దీని తెలివి చూసి మనకే ఆశ్చర్యం వేస్తుంది. అలా అని దీనికి ఒక జీవితం ఉంది అనవచ్చా అంటే కాదనే చెప్తారు శాస్త్రవేత్తలు. మరి రోబోలకు కూడా ఒక జీవితం ఉంది అనిపించాలంటే ఏం చేయాలి అనే సందేహం శాస్త్రవేత్తలకు వచ్చింది.

ప్రస్తుతం రోబోలు అనేవి కేవలం ఎలక్ట్రానిక్ మెటీరియల్స్‌తోనే తయారు చేస్తాం. అలా కాకుండా వాటిని నేచురల్ సెల్స్‌తో తయారు చేస్తే.. అది కూడా బతికున్న వాటి సెల్స్‌తో తయారు చేస్తే.. ఎలా ఉంటుంది అనే ఆలోచన శాస్త్రవేత్తలకు వచ్చింది. అందుకే ఆ దిశగా అడుగువేశారు అమెరికా శాస్త్రవేత్తలు. గత నాలుగేళ్లుగా ఈ కోణంలోనే పరీక్షలు చేస్తూ రోబోలకు ప్రాణం పోయాలని చూస్తున్నారు. శాస్త్రవేత్తలు తయారు చేస్తున్న ఈ కొత్త రకం రోబోల పేరే ‘గ్జెనోబోట్స్’.


బతికున్న కప్పల నుండి సెల్స్‌ను తీసుకొని గ్జెనోబోట్స్‌ను తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఒకవేళ మెటల్, ప్లాస్టిక్స్‌తో తయారు చేస్తే ఆ రోబోలకు వాటంతట వాటికి జ్ఞానం అనేది రాదు. అందుకే ఒక బతికున్న జీవి సెల్స్‌ను తీసుకొని రోబోలకు నేచురల్‌గా ఆలోచించే శక్తిని ఇవ్వడానికి ప్రయత్నించామని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఈ సెల్స్ అనేవి రోబోలు వాటంతట అవే కదలడానికి, సొంతంగా ఆలోచించడానికి ఉపయోగపడతాయని అన్నారు. త్వరలోనే ఈ రోబోలు రీప్రొడక్షన్‌ కూడా చేసేలా మారుస్తామని వారు చెప్తున్నారు. ప్రస్తుతం గ్జెనోబోట్స్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉన్నాయని తెలుస్తోంది.

Tags

Related News

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Big Stories

×