EPAPER

Mahabharatam:- మహాభారతంలో నవగుంజర

Mahabharatam:- మహాభారతంలో నవగుంజర

Mahabharatam:– మహా వీరుడైన అర్జునుడు ఒక పర్వతం మీద తపో దీక్షలో ఉన్నాడు. ఏదో అలికిడితో అతనికి తపోభంగమయింది. కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఒక విచిత్రమైన జంతువు నిలిచి ఉంది. కోడి తల, నెమలి మెడ, సింహం నడుము, ఎద్దు మూపురం, తోకగా ఒక సర్పం, ఒక కాలు ఏనుగుది, మరో కాలు సింహానిది, మూడో కాలు గుర్రానిది, నాలుగో కాలికి బదులు తామర పువ్వు పట్టుకున్న మనిషి చెయ్యి… ఇదీ దాని ఆకారం. వెంటనే అర్జునుడు విల్లు అందుకున్నాడు. ఆ వింత జంతువు తన మీద దాడి చెయ్యడానికి ముందే దాన్ని మట్టు పెట్టాలని బాణం సంధించాడు.


ఇంతలో అతని దృష్టి ఆ జంతువు చేతిలోని తామర పువ్వు మీద పడింది. ఆ క్షణంలోనే అతనికి అర్ధమైంది. ఆ రూపంలో వచ్చినవాడు పరమాత్మ అని! వెంటనే బాణం వదిలేశాడు. దాని ముందు మోకరిల్లి ప్రార్థించాడు. ఒరియా భాషలో సరళ దాస్‌ రచించిన మహాభారతంలోని ఒక ఘట్టం ఇది. 9 జీవుల లక్షణాలున్న ఆ జంతువే నవగుంజర. అంటే తొమ్మిది గుణాలు ఉన్నది అని అర్థం. అంతిమమైన సత్యం ఒకటే అయినా అది వివిధ రూపాల్లో కనిపిస్తుంది. ఆ రూపాల్లోని విశిష్టతను గ్రహించాలి. ఆ సత్యాన్ని ఏకోన్ముఖంగా చేరుకోవాలి. ఈ విషయాన్ని అర్జునుడికి బోధించాలన్నది భగవంతుడి సంకల్పం. ఆయన నవగుంజర రూపంలో దర్శనమివ్వడం వెనుక ఆంతర్యం అదేనన్నది పెద్దల మాట

ఒడిశా సంస్కృతిలో, కళల్లో నవగుంజరకు సముచిత స్థానం ఉంది. అక్కడ పటచిత్ర కళలో నవగుంజర ప్రముఖంగా కనిపిస్తుంది. ఆ రాష్ట్రంలో ఆడే ప్రాచీనమైన గంజిఫా ముక్కల ఆటలోనూ నవగుంజర చోటుచేసుకుంది. పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంలో ఎడమ వైపు అర్జునుడు- నవగుంజర ఘట్టాన్ని చెక్కారు. ఆ ఆలయ పైభాగాన ఉన్న నీల చక్రం దగ్గర ఎనిమిది నవగుంజరలు తీర్చి ఉంటాయి. మహాభారతంలో నవగుంజర ప్రస్తావన ఉంది.. నవగుంజర జంతువు. ఇది 9 జంతువులు గా మారుతుంది. విష్ణు మూర్తి అవతారం అయిన మృగంగా ఇది వస్తుంది. కృష్ణుడి విశ్వరూపం చూపంచిన అర్జునుడు కూడా ఇది చూశాడని భగవద్గీతలో ప్రస్తావించారు.


Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×