EPAPER

MM Keeravani:- వారి కృషి వ‌ల్లే ఆస్కార్ సాధ్య‌మైంది

MM Keeravani:- వారి కృషి వ‌ల్లే ఆస్కార్ సాధ్య‌మైంది

MM Keeravani:- ఆస్కార్ తీసుకున్న‌ప్పుడు ఎలాంటి ఎగ్జ‌యిట్మెంట్ లేద‌ని అన్నారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి. RRR సినిమాలోని ‘నాటు నాటు’ పాట‌కు ఆస్కార్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇండియాలో ఆస్కార్ అందుకున్న తొలి చిత్ర‌మిది. ఈ పాట‌ను రాసిన చంద్ర‌బోస్‌కి, మ్యూజిక్ అందించిన కీర‌వాణి లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్ అవార్డులు అందుకున్న‌ప్పుడు తెలుగువారి ఆనందానికి అధులు లేవు. ఇప్పుడు ఎంటైర్ RRR టీమ్‌ని తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఘ‌నంగా స‌న్మానించింది. ఈ వేడుక‌ల‌కు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌తో పాటు తెలంగాణ మంత్రులు త‌లసాని శ్రీనివాస యాద‌వ్‌, శ్రీనివాస్ గౌడ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా..


ఎం.ఎం.కీర‌వాణి మాట్లాడుతూ ‘‘RRRలోని నాటు నాటు పాట‌కు ఆస్కార్ అవార్డ్ వ‌చ్చిందంటే ప్ర‌ధాన‌ కార‌ణం రాజ‌మౌళి, ప్రేమ్ ర‌క్షిత్‌. వాళ్లు మూల విరాట్స్ అయితే వారి త‌ర‌పున స‌త్కారాలు, అభినంద‌న‌లు అందుకోవ‌టానికి నేను, చంద్ర‌బోస్ ఉత్సవ విగ్ర‌హాల్లా ఉన్నాం. ఈవెంట్ కోసం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ అంతా రావ‌టం చాలా సంతోషంగా ఉంది. ఇలా ప‌దే ప‌దే ఒక వేదిక‌పై మ‌న ప‌రిశ్ర‌మ క‌ల‌సుకోవాల‌ని అనుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా నా తొలి పాట చెన్నై ప్ర‌సాద్ 70 ఎం.ఎం థియేట‌ర్‌లో రికార్డింగ్ జ‌రిగింది. అదొక దేవాల‌యంలా ఉంటుంది. ఆ థియేట‌ర్‌లో సాంగ్ కంపోజ్ చేసిన అనుభూతి ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేనిది. ఆ అనుభూతి స్వీట్‌లాంటిదైతే.. ఆస్కార్ టీ తాగిన‌ట్లు అనిపించింది. స్వీట్ తిన్న త‌ర్వాత టీ తాగితే ఆ మాధుర్యం తెలియ‌దు కదా. అలాగ‌ని నేను ఆస్కార్‌ని త‌క్కువ చేయ‌టం లేదు. ఆ అవార్డ్ తీసుకున్న‌ప్పుడు ఎలాంటి ఎగ్జ‌యిట్‌మెంట్ లేదు.

నేను రామోజీరావుగారిని క‌లిసిన‌ప్పుడు మీరు ఆస్కార్ తీసుకు రండి అని ఆయ‌న అంటే నేను ఆశ్చ‌ర్య‌పోయాను. ఆయ‌న‌లాంటి వ్య‌క్తి ఆస్కార్‌కి వాల్యూ ఇస్తున్నారంటే అందులో ఏదో ఉంద‌ని అనుకున్నాను. ఆస్కార్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ స‌మయంలో అవార్డ్ వ‌స్తుందో రాదోన‌ని టెన్ష‌న ప‌డ్డా.. రామోజీరావుగారి కోస‌మైనా ఆస్కార్ రావాల‌ని అనుకున్నాను. వ‌చ్చింది’’ అన్నారు. ఇదే సందర్భంలో దర్శకుడు రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్ రక్షిత్, నాటు నాటు పాటకు కష్టపడి డాన్స్ చేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్, ఉ క్రెయిన్ డాన్సర్స్ సమిష్టి కృషితోనే ఆస్కార్ సాధించామని అన్నారు కీరవాణి.


Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×