EPAPER

Rise in India:- ఇండియాలో పెరుగుతున్న ఆ ఆరోగ్య సమస్యలు..

Rise in India:- ఇండియాలో పెరుగుతున్న ఆ ఆరోగ్య సమస్యలు..

Rise in India:- ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్‌మెంట్ ఎంతగా పెరుగుతుందో.. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా అంతే పెరిగిపోతున్నాయి. ఈరోజుల్లో ప్రతీ ఆరోగ్య సమస్యలకు ఏదో ఒక మందు కానీ, చికిత్స కానీ ఉంది. కానీ అలాంటి ఏ పరిష్కారం లేని వ్యాధులు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటివి ఇండియాలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. ఆ వ్యాధుల బారినపడిన వారు ఎక్కువగా మరణిస్తున్నారని కూడా స్టడీ చెప్తోంది.


ఒబిసిటీ, డయాబెటీస్, హైపర్‌టెన్షన్, కొలెస్ట్రాల్.. ఈరోజుల్లో ఈ ఆరోగ్య సమస్యలు వయసుతో సంబంధం లేకుండా అటాక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇండియాలో ఈ వ్యాధుల బారినపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగపోతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతే కాకుండా వారిలో 65 శాతం మృత్యువాత పడక తప్పడం లేదని తేల్చారు. ఈ విషయాలకు సంబంధించి ‘హెల్త్ ఆఫ్ నేషన్ 2023’ పేరుతో వారు ఒక రిపోర్టును కూడా విడుదల చేసింది ఒక ప్రైవేట్ ఆసుపత్రి సంస్థ.

మామూలుగా ఒబిసిటీ, డయాబెటీస్ వంటి వ్యాధులను నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ (ఎన్సీడీ) అంటారు. ప్రస్తుతం దేశంలో ఎన్సీడీ పేషెంట్లు పెరిగిపోవడానికి కారణమేంటి అని శాస్త్రవేత్తలు తెలుసుకోవడం మొదలుపెట్టారు. గత మూడేళ్లుగా 5 లక్షలకు పైగా పేషెంట్ల సమాచారాన్ని వారు స్టడీ చేసి చూశారు. దాని ప్రకారం 2019 నుండి 2022 మధ్యలో ఇండియాలో ఒబిసిటీ కేసులు విపరీతంగా పెరిగిపోయాయని తేలింది. 45 ఏళ్ల వయసులోపు ఉన్నవారిలో 43 శాతం, 45 వయసుకంటే ఎక్కువ ఉన్నవారిలో 60 శాతం ఈ కేసులు పెరిగాయన్నారు.


అదే సమయంలో కొలెస్ట్రాల్ బారినపడిన వారి సంఖ్య 18 శాతం పెరిగిందని తేలింది. అందులోనూ 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారిలో 35 శాతం ఎక్కువగా ఈ కేసులు పెరిగాయన్నారు. ఇక డయాబెటీస్ 8 శాతం, హెపర్‌టెన్షన్ 11 శాతం పెరిగిందని తేల్చారు. ఒత్తిడి అనేది హెపర్‌టెన్షన్, డయాబెటీస్ లాంటి వాటికి ఎక్కువగా కారణమవుతుందని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా ఒత్తిడి వల్ల ఆడవారికంటే మగవారికే ఎక్కువగా డయాబెటీస్ అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.

గత 30 ఏళ్లలో ఎన్సీడీలు చాలావరకు ప్రజలు చావుకు కారణమవుతున్నాయని, అందుకే ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని పరిశోధకులు ప్రభుత్వాలను కోరారు. ఎన్సీడీలు కేవలం మెడికల్ రంగాన్నే కాదు ఎకానమిక్ మెరుగుదలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తాయని వారు అన్నారు. వీటి వల్ల ఇండియాపై 2030లోపు 4.8 డాలర్ల ఎకానమిక్ భారం పడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. సరిపడా నిద్ర అనేది చాలావరకు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని పరిశోధకులతో పాటు వైద్యులు కూడా సలహా ఇస్తున్నారు.

Related News

Xiaomi 15 Series: షియోమి నుంచి కొత్త ఫోన్లు.. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లాంచ్‌కు రెడీ, స్పెసిఫికేషన్లు అదిరిపోయాయ్!

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Big Stories

×