EPAPER

Sharmila: షర్మిల.. ఇలాగైతే ఎలా? అంత తొందరపాటేలా?

Sharmila: షర్మిల.. ఇలాగైతే ఎలా? అంత తొందరపాటేలా?
sharmila cpm

Sharmila: వైఎస్ షర్మిల. వైఎస్సార్‌టీపీ అధినేత్రి. ఫుల్ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. పాదయాత్రలతో ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతీరోజూ కేసీఆర్ పాలనను మాటలు, ట్వీట్లతో తూట్లు పొడుస్తున్నారు. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా.. అక్కడ ఆమె వాలిపోతున్నారు. అన్నదాతలకు అండగా నిలిచారు. ఆత్మహత్య చేసుకుంటే ఓదార్చారు. నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై గొంతెత్తారు. అన్నిటికీ మించి.. TSPSC పేపర్ లీక్‌పై అంతకుమించి ఉద్యమిస్తున్నారు. అరెస్టులు, నిర్బంధాలతో సర్కారు ఉక్కుపాదం మోపుతున్నా అదరడం లేదు.. బెదరడం లేదు.. పోరాటం ఆపడం లేదు.


ఈ దశలో షర్మిల రాజకీయంగా మరో ముందడుగు వేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనపై సమిష్టిగా పోరాడుదాం రమ్మంటూ.. బీజేపీ, కాంగ్రెస్‌లకు స్నేహ హస్తం చాటారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సార్‌నూ కలిశారు. కానీ, బీజేపీ కుదరదని చెప్పింది. కాంగ్రెస్ సైలెంట్‌గా ఉంది. ఇంత వరకూ అంతా బాగుంది. కానీ, కమ్యూనిస్టుల విషయం వచ్చే సరికి షర్మిల తప్పటడుగు వేశారనే విమర్శ వినిపిస్తోంది. తనను తాను ఎక్కువగా ఊహించుకుంటూ.. కామ్రేడ్లను తక్కువ చేసి మాట్లాడటం తప్పులో పడేసింది.

టి-సేవ్.. పేరుతో విపక్షాలన్నిటినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. పెద్ద పార్టీలు పక్కకు తప్పుకున్నా.. పాపం సీపీఎం మాత్రం పోనీలే అనుకుని పార్టీ ఆఫీసుకు ఆహ్వానించింది. షర్మిల ప్రపోజల్ పెట్టారు.. కామ్రేడ్లు అంగీకరించారు. వచ్చామా.. మాట్లాడుకున్నామా.. పోయామా.. అని లేకుండా.. సీపీఎం కార్యాలయంలోనే ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అందులోనూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమక్షంలోనే షర్మిల సూటిపోటి మాటలు మాట్లాడారు. ఆయన సైతం అదే రేంజ్‌లో కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.


బీఆర్ఎస్‌కు బీ టీమ్‌గా కామ్రేడ్లు పని చేస్తున్నారు.. మునుగోడు ఉప ఎన్నికల్లో అలానే చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు షర్మిల. తిరిగి తనపైనే బీఆర్ఎస్‌కు బీ టీమ్ అంటూ విమర్శలు చేస్తున్నారంటూ కమ్యూనిస్టులపై ఫైర్ అయ్యారు. సీపీఎం చేసిన ప్రజా ఉద్యమాలకు ఎప్పుడైనా తనను పిలిచారా? అని నిలదీశారు. పాలేరులో షర్మిలపై తమ్మినేని పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆమె ఇప్పుడిలాంటి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.

షర్మిల మాటలకు తమ్మినేని బాగానే హర్ట్ అయినట్టున్నారు. మా ఆఫీసుకు వచ్చి మమ్మల్నే అంటారా అన్నట్టు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. షర్మిల మర్యాద నిలుపుకోలేదని.. మా ఆఫీసుకు వచ్చి మాపైనే విమర్శలు చేసే సాహసం సరికాదని హితవు పలికారు. తనకు విజ్ఞత, మర్యాద ఉందని.. తానుకూడా ఆమెలా మాట్లాడలేనంటూ షర్మిలకు గట్టిగానే ఇచ్చారు తమ్మినేని వీరభద్రం.

ఎక్కడి కామ్రేడ్లు, ఎక్కడి షర్మిల. కమ్యూనిస్టులది దశాబ్దాల పోరాట చరిత్ర. ఎర్రజెండా ఉద్యమాలు అనేక ప్రభుత్వాలకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఒక్కసారి కూడా అధికారంలోకి రాకున్నా.. ఏళ్లుగా ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నాయి. అలాంటి సీపీఎం పార్టీపై.. నిన్నగాక మొన్న వైఎస్సార్‌టీపీతో రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల.. వారి ఆఫీసుకే వెళ్లి వారిపైనే విమర్శలు చేయడం ఆమె రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం అంటున్నారు. సీపీఎం.. బీఆర్ఎస్‌కు బీ టీమ్ అని భావిస్తే.. అసలు వారి దగ్గరికే వెళ్లి ఉండాల్సింది కాదామె. వాళ్లేమీ రారమ్మని పిలవలేదుగా? ఈమెనే నేనొస్తానంటూ వెళ్లారుగా? మరి హుందాగా చర్చలు జరిపి.. నిరుద్యోగుల తరఫు పోరాటం వరకే పరిమితం అయితే బాగుండేదిగా? తానే గొప్ప అన్నట్టు.. కామ్రేడ్లనే విమర్శించి విమర్శల పాలవుతున్నారు షర్మిల. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో రాణిస్తున్నారు.. అప్పుడే అంత తొందరేంటి? ఈ తప్పటడుగులేంటి? అంటున్నారు విశ్లేషకులు.

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×