Twitter: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మామూలోడు కాదు. ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఉద్యోగులతో పాటు జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులను తొలగించాడు. ట్విట్టర్ కార్యాలయాలను మూసేశాడు. వెరిఫైడ్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చాడు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు మస్క్.
అదే ట్విట్టర్ లోగో ఛేంజ్. బ్లూ బర్డ్ స్థానంలో డోజీకాయిన్‌కు సంబంధించిన డోజీ మీమ్‌ను ఉంచారు. మంగళవారం నుంచి ట్విట్టర్‌లో ఈలోగో దర్శనమిస్తోంది. ఉదయం లేవగానే ఈ లోగోను చూసి యూజర్లు షాక్ అవుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఇతరులతో పంచుకుంటున్నారు. అయితే ఈ లోగో కేవలం డెస్క్ టాప్ వెర్షన్‌లో మాత్రమే మారింది. మొబైల్ వెర్షన్‌లో పాత లోగోనే కనిపిస్తుంది.
దీనిపై మస్క్ కూడా ట్వీట్ చేశాడు. ఇకపై డోజీమీమే కొత్త లోగో అని ఓ మీమ్‌ను ట్వీట్ చేశాడు. అయితే 2022లో ఓ యూజర్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసి డోజీని లోగోగా పెట్టాలని మస్క్‌కు సూచించాడట. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా మస్క్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు.