EPAPER

Explosion : 180 లైట్ ఇయర్స్ దూరంలో పేలుడు.. డిస్క్ ఆకారంలో..

Explosion : 180 లైట్ ఇయర్స్ దూరంలో పేలుడు.. డిస్క్ ఆకారంలో..
Explosion

Explosion : 180 లైట్ ఇయర్స్ దూరంలో జరిగిన ఒక పేలుడు ప్రస్తుతం శాస్త్రవేత్తలను అయోమయంలో పడేస్తోంది. దానికి కారణం ఏంటంటే అది ఒక ప్యాన్‌కేక్ ఆకారంలో ఉండడమే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే. మామూలుగా స్పేస్‌లో పేలుడు అనేది గోళాకారంలో ఉండాలి కానీ ప్యాన్‌కేక్ ఆకారంలో పేలుడు సంభవించడం ఏంటి అనేది వారిని మరిన్ని పరిశోధనలు చేసేలా చేస్తోంది. ప్రస్తుతం శాస్త్రవేత్తల ఫోకస్ అంతా దీనిపైనే ఉంది.


మామూలుగా నక్షత్రాలు గోళాకారంలో ఉంటాయి. అందుకే అంతరిక్షంలో స్టార్లు పేలినప్పుడు గోళాకారమే కనిపిస్తుంది. కానీ తాజాగా జరిగిన పేలుడు మాత్రం అసలు గోళాకారంలో లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. దాదాపు ఒక డిస్క్‌లాగానే ఇది కనిపించిందని వారు తెలిపారు. దీనిని ఫాస్ట్ బ్లూ ఆప్టికల్ ట్రాన్సియెంట్ (ఎఫ్‌బీఓటీ)గా గుర్తించారు. ఇది మామూలుగా సంభవించే పేలుడు కాదని, చాలా అరుదైన సందర్భాల్లోనే జరుగుతుందని తెలిపారు.

మొదటిసారిగా ఈ ఎఫ్‌బీఓటీ అనేది 2018లో జరిగిందని శాస్త్రవేత్తలు అన్నారు. తాజాగా జరిగినదానితో కలిపి కేవలం అయిదు ఎఫ్‌బీఓటీలు మాత్రమే సంభవించాయని వారు తెలిపారు. కానీ ఇవి ఎందుకు సంభవిస్తాయనే దానిపై ఇంకా శాస్త్రవేత్తలకు పూర్తి క్లారిటీ రాలేదు. అందుకోసమే తాజాగా జరిగిన ఎఫ్‌బీఓటీపై వారు క్షుణ్ణంగా పరిశోధనలు చేయనున్నారు. అయితే ఇప్పటివరకు ఎఫ్‌బీఓటీలు అనేవి మిగతా నక్షత్రాల పేలుళ్లలాగా ఉండదని, మరికొంత ప్రకాశవంతంగా ఉంటుందని వారు నిర్ధారణకు వచ్చారు.


డిస్క్ షేప్ పేలుళ్లపైనే ప్రస్తుతం శాస్త్రవేత్తలు పూర్తి ఫోకస్ ఉంది. ఇవి ఎందుకు సంభవిస్తాయి అనేదానిపై శాస్త్రవేత్తలకు కొన్ని అభిప్రాయాలు ఉన్నా.. అందులో ఏవీ పూర్తిగా నిర్ధారణ కాలేదు. లివర్‌పూల్ టెలిస్కోప్‌తో వీటి గురించి తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పేలుడుకు సంబంధించిన ఇమేజ్‌లను వారు 3డి సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేశారు. ఇప్పటికే ఎఫ్‌బీఓటీపై పరిశోధనలు దాదాపు పూర్తయ్యాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

Related News

TG Politics: బాబును కలిసిన తీగల, మల్లారెడ్డి.. టీడీపీలోకి అంటూ పొలిటికల్ బాంబ్.. కానీ..

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

×