EPAPER
Kirrak Couples Episode 1

Technology : మనిషిలోని వ్యక్తిత్వాన్ని చంపేస్తున్న టెక్నాలజీ..

Technology : మనిషిలోని వ్యక్తిత్వాన్ని చంపేస్తున్న టెక్నాలజీ..
Technology

Technology : సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల ఏదైనా సాధ్యమవుతుంది అని టెక్ నిపుణులు గర్వంగా చెప్పుకుంటారు. కానీ అన్ని సాధ్యమవ్వవు అని మరికొందరి వాదన. ఎంత కృత్రిమ మేధస్సు అనేవి మానవ మేధస్సుతో పోటీపడినా.. మానవ మేధస్సుకు ఉండే ఆలోచన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు ఉండదని కొందరి అభిప్రాయం. అంతే కాకుండా ఇంకా ఎన్నో విషయాలను ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డిసైడ్ చేయలేదని వారు చెప్తున్నారు.


ఒక వయసు వచ్చిన తర్వాత నెక్స్‌ట్ ఏం చేయాలి? కెరీర్‌లో ఎలా ముందుకెళ్లాలి? లేదా ఏ చదువును ఎంచుకోవాలి? ఇలా ఎన్నో ఆలోచనలు వస్తాయి. అలాంటి సమయంలో యువతకు వచ్చే అయోమయాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది తీర్చలేదు అనే కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు నిపుణులు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది వారికి ఏది చేయాలో చెప్పగలిగే గైడ్‌లాగా ఉండగలుగుతుందేమో కానీ వారిని గమ్యానికి మాత్రం చేర్చలేదని నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో సైంటిఫిక్ అడ్వాన్స్‌మెంట్స్ వచ్చాయి. ఏది కావాలన్నా ఒక క్లిక్‌తో దొరికేంత దగ్గరలో ఉంటోంది. కానీ టెక్నాలజీ ఎంత పెరిగినా.. మనిషిని మంచిగా మార్చలేదు కదా..? అని నిపుణులు ఎదురుప్రశ్నలు వేస్తున్నారు. నిజానికి వారి ప్రశ్న నిజమే అని చాలామందితో వారితో సమ్మతిస్తున్నారు. అది సైన్స్ చేతిలో లేని పని అని కొంతమంది బయటికి వారి అభిప్రాయాన్ని చెప్పకపోయినా నిపుణులు చెప్పింది నిజమే అనుకుంటున్నారు.


మోడర్న్ టెక్నాలజీ అనేది మనిషి కోసం అన్ని పనులు చేయలేదు అని చెప్పడానికి నిపుణులు ఇస్తున్న ఈ ఉదాహరణలు.. ఇతరుల నోళ్లు మూయిస్తున్నాయి. మంచి మనిషిగా జీవించాలి అనుకోవడం ఎంత ముఖ్యం అనే విషయాన్ని చాలామంది గ్రహించడమే మర్చిపోయారు. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా మంచి మనుషులం అవ్వలేమని అనుకుంటున్నామా అని నిపుణులు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. టెక్నాలజీ గురించి ఆలోచించినంత వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడం లేదని చెప్తున్నారు.

టెక్నాలజీ అనేది మనిషిని మనిషిగా జీవించనివ్వకుండా ఆపేస్తుందని, తనలోని వ్యక్తిని చంపేస్తుందని నిపుణులు అంటున్నారు. అలా అని టెక్నాలజీకి దూరంగా ఉండాలని వారి ఉద్దేశ్యం కాదని, కాసేపు తమతో తాము సమయం గడపడం కూడా ముఖ్యమని స్మార్ట్ ఫోన్లు లేని రోజులని గుర్తుచేస్తున్నారు. వారు అడుగుతున్న ప్రశ్నలు, ఇస్తున్న సలహాలు కొందరిలో అయినా టెక్నాలజీని చూసే దృక్పథం మారుతుందని కొందరు అనుకుంటున్నారు.

Tags

Related News

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×