EPAPER

Target BRS : టార్గెట్ బీఆర్ఎస్? అందుకే టీఆర్ఎస్ ను రెచ్చగొడుతున్నారా?

Target BRS : టార్గెట్ బీఆర్ఎస్? అందుకే టీఆర్ఎస్ ను రెచ్చగొడుతున్నారా?

Target BRS : కేసీఆర్ జై బీఆర్ఎస్ అంటున్నారు. ఢిల్లీపై దండయాత్ర చేస్తానంటున్నారు. బీజేపీ ముక్త్ భారత్ తన మెయిన్ టార్గెట్ అని చెబుతున్నారు. పార్టీనైతే ప్రకటించేశారు గానీ.. ఇంకా జెండా, అజెండా ఫిక్స్ కాలేదు. ఎవరు సై అంటారో, ఎవరు నై అంటారో తేలడం లేదు. అయితే, బీఆర్ఎస్ అంటే బీజేపీకి భయం లేకున్నా.. ఇలాంటి వాటిని మొదట్లోనే తుంచేయాలని, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేది కమలనాథుల భావన. దేశంలోని బీజేపీ వ్యతిరేకులకు బీఆర్ఎస్ ఓ రాజకీయ వేదిక కాకుండా.. వారంతా ఒక పార్టీ గొడుగు కిందకు చేరకుండా.. కాషాయ దళం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.


బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ ఢిల్లీ వరకు రాకుండా.. తెలంగాణలోనే ఆయన్ను రాజకీయంగా కట్టిపడేసేలా బీజేపీ దూకుడు పాలిటిక్స్ చేస్తోందని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి.. ఇక కేసీఆర్ పని అయిపోయిందంటూ ఆయన ఇమేజ్ ను మాగ్జిమమ్ డ్యామేజ్ చేయాలని భావిస్తోంది. మరోవైపు, కొండా, బూర లాంటి నేతలను పార్టీలో చేర్చుకుని.. గులాబీ దళం బలహీనపడుతోందనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్లాలనేది కాషాయం ప్లాన్.

ఈ స్ట్రాటజీలో భాగంగా ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ.. మొత్తం 15 మందితో చర్చలు జరుగుతున్నట్టు లీకులిస్తూ మైండ్ గేమ్ మొదలుపెట్టిందని అనుమానిస్తున్నారు. గులాబీ పార్టీ నేతల పక్కన కూర్చున్న వాళ్లంతా ఆ పార్టీ నాయకులు కాదంటూ.. కావాలనే లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ ను చక్కబెట్టుకునే ప్రయత్నాల్లో కేసీఆర్ ను బిజీగా ఉంచి.. బీఆర్ఎస్ కు సమయం లేకుండా చిక్కుల్లో పడేయాలనేది కమల వ్యూహంలా కనిపిస్తోంది. అటు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఈడీ, సీబీఐలు తెలంగాణలో ఎంట్రీ ఇవ్వడం కూడా పరోక్ష వార్నింగే అంటున్నారు.


బీజేపీ స్ట్రాటజీని పసిగట్టిన కేసీఆర్.. రివర్స్ గేమ్ ఆడారు. బూర నర్సయ్య గౌడ్ కు బదులుగా.. ముగ్గురు బడా నేతలను బీజేపీ నుంచి బయటకు లాగి పార్టీలో చేర్చుకుని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. కేసీఆర్ సైతం కమలనాథుల వ్యూహాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ కు 90మందికి పైగా ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీ చెబుతున్నట్టు.. ఆ ఎనిమిది మంది పార్టీని వీడినా ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చు. కాకపోతే, వలసలు మరిన్ని పెరిగితే మాత్రం కష్టమే. మునుగోడు బై పోల్ లో టీఆర్ఎస్ ఓడిపోతే మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. గెలిస్తే.. బీజేపీ స్పీడుకు తాత్కాలిక బ్రేకులు పడొచ్చు.

వచ్చే ఏడాదిన్నర పాటు ఏదో ఒక టాస్క్ లో కేసీఆర్ ను స్టేట్ పాలిటిక్స్ తోనే బిజీగా ఉంచేలా చేయాలనేది బీజేపీ స్ట్రాటజీగా కనిపిస్తోంది. ఆ మేరకు బీఆర్ఎస్ కు చెక్ పెట్టేలా.. ఢిల్లీ కేంద్రంగా కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.

అయితే, బీజేపీ ఇక్కడో చిన్న లాజిక్ మరిచినట్టుంది. ఎంతసేపూ టీఆర్ఎస్ పైనే ఫోకస్ పెడుతోంది కానీ.. తెలంగాణలో ఇప్పటికీ బలంగా ఉన్న కాంగ్రెస్ ను సరిగ్గా అంచనా వేయలేకపోతోంది. బీజేపీకి గ్రామాల్లో పెద్దగా పట్టు లేదు. అక్కడ హస్తం పార్టీ ఓట్ బ్యాంక్ చెక్కుచెదరలేదు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ మరింత బలం పుంజుకుంటోంది. ప్రస్తుతానికైతే వార్ టీఆర్ఎస్, బీజేపీల మధ్యే జరుగుతున్నట్టు అనిపిస్తున్నా.. ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఏకు మేకై గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

Tags

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×