EPAPER

Hidimba Temple : నేటికి పూజలందుకుంటున్న రాక్షసి ఎవరు..?

Hidimba Temple : నేటికి పూజలందుకుంటున్న రాక్షసి ఎవరు..?

Hidimba Temple : దేవుళ్లకి, దేవతలకి గుడులు, గోపురాలు మనకి తెలుసు. లెక్కలేని సంఖ్యలో ఉన్న గుడులు ఉన్న మనదేశంలో రాక్షసులకు ఆలయం ఉంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీలో ప్రాచీన ఆలయంలో
రాక్షస జాతికి చెందిన హిడింబికి ఆలయం ఉందంటే నమ్ముతారా.. ? ఘటోత్కచునికి తల్లి.. భీమునికి భార్య అయిన రాక్షస సంతతికి చెందినదే హిడింబి. ఏటా వేలాది మంది భక్తులు హిడింబిని దర్శించుకుంటారు.


పురాణాలు చదివిన వారికి హిడింబి సంగతి బాగా తెలుసు. మహాభారతంలో హిడింబిది ప్రత్యేకపాత్ర. అరణ్యవాసంలో భాగంగా పాండవులు ఒక గుహలోకి వెళతారు. అక్కడ మిగిలినవాళ్లు పడుకుంటే.. భీముడు వారికి కాపలాగా ఉంటాడు. అయితే ఈ ప్రాంతంలో ఉండే హిడింబాసురుడు అనే రాక్షసుడు నరవాసన పసిగట్టి.. వాళ్ల వివరాలు కనుక్కోమని అతని చెల్లెలు హిడింబను పంపిస్తాడు.

రాత్రివేళ కాపలా ఉన్న భీముడిని చూసి.. ప్రేమలో పడుతుంది హిడింబి. తన అన్నతో ప్రమాదం పొంచి ఉందని భీముడిని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత భీముడితో జరిగిన యుద్ధంలో హిడింబాసురుడు మరణిస్తాడు. అయితే భీముడితో ప్రేమలో ఉన్న విషయాన్ని కుంతిదేవికి చెప్పి పెళ్లి చేయమని వేడుకుంటుంది హిడింబి. కుంతి అంగీకారంతో హిడింబి, భీముడు పెళ్లి చేసుకుని కొద్దిరోజులు అక్కడే ఉంటారు. వీరికి ఘటోత్కచుడు జన్మిస్తాడు. పాండవులు వెళ్లిపోయిన తర్వాత ఘటోత్కచుడిని పెంచి పెద్దవాడిని చేస్తుంది. ఘటోత్కచుడు రాజ్యపాలన తీసుకున్న తర్వాత హిడింబి హిమాలయాలకు వెళ్లిపోతుంది. అక్కడే తప్పసు చేసి.. కోరికలు తీర్చే దేవతగా మారుతుంది.


ఆమె తపస్సు చేసిన ప్రాంతంలోనే మహారాజా బహదూర్‌ సింగ్‌ క్రీ.శ 1553లో హిడించా పేరుతో నాలుగు అంతస్తుల్లో ఆలయాన్ని కట్టాడు. దట్టమైన అడవిలో ఈ ఆలయంలో నిత్యం అగ్నిహోత్రం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. కొన్ని రోజులు మినహా ఏడాదంతా ఈ ఆలయంలో మంచు పేరుకుని ఉంటుంది. గుడిలో హిడింబి మాత విగ్రహం మాత్రం కేవలం మూడు అంగులాలే ఉండటం విశేషం. ఇక్కడ ఆమె పాదముద్రలు కూడా ఉంటాయి. ఈ గుడికి కొంత దూరంలో ఘటోత్కచుడి ఆలయం కూడా ఉంటుంది.ఏడాదికి ఒకసారి హిడింబి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ దుంగ్రీ మేళా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హిడింబి ఆలయంలో మేకలు,దున్నలు, జింకలు సహా జంతువుల అవశేషాలే కనిపిస్తాయి.

Related News

Thathastu Deities: తథాస్తు దేవతలు నిజంగా ఉన్నారా? వారు ఎవరు? ఏ సమయంలో భూమి పై తిరుగుతారు?

Karthika Masam 2024: కార్తీక మాసం విశిష్టత.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !

Horoscope Nov 4: ఈ రోజు మేష రాశి నుంచి మీనం వరకు ఎలా ఉండబోతుందంటే..

Chandra Gochar: చంద్రుడి సంచారం.. నవంబర్ 5 నుంచి ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం

Karthika Deepotsavam Live: ‘బిగ్ టీవీ’ కార్తీక దీపోత్సవాన్ని కనులారా వీక్షించండి

Weekly Horoscope Nov 3 to 9: ఈ వారమంతా మీకు ఎలా ఉండబోతుందంటే..?

Rahu Transit Aquarius: 2025లో రాహువు సంచారం.. ఈ 3 రాశుల వారి తలరాతలు మారిపోనున్నాయ్

Big Stories

×