Costliest Apartment: ఎవరన్నారు రియల్ ఎస్టేట్ పడిపోయిందని? ఎవరన్నారు దేశంలో డబ్బులు లేవని? ఎవరన్నారు భారత్ పేద దేశమని? ఈ న్యూస్ చదవండి మీకే తెలుస్తుంది ఇండియన్స్ ఎంత రిచ్చో.
ముంబై మహానగరం. ఓ వైపు అరేబియా మహా సముద్రం. సంపన్నులకు నిలయమైన సౌత్ ముంబైలోని మలబార్ హిల్. అందులో ‘సీ ఫేసింగ్’ లగ్జరీ అపార్ట్‌మెంట్. లగ్జరీ అంటే అదేదో సినిమాల్లో చూచే ఇండ్లలాంటివి అనుకునేరో. అంతకు మించి. లగ్జరీకే లగ్జరీ ఆ ఫ్లాట్. ట్రిప్లెక్స్ అపార్ట్‌మెంట్.
లోధా. రియల్ ఎస్టేట్ కంపెనీలో టాప్. ఖరీదైన అపార్ట్‌మెంట్లు కట్టడంలో ఎక్స్‌పర్ట్. ముంబై మలబార్ హిల్‌లో లేటెస్ట్‌గా మరో కాస్ట్లీయెస్ట్ టవర్ నిర్మించింది. అందులో ఓ ట్రిప్లెక్స్ ఫ్లాట్‌ను కొన్నారు జేపీ తపారియా కుటుంబ సభ్యులు.
26, 27, 28 అంతస్తుల్లో ఉంటుంది ఆ ఫ్లాట్. మొత్తం 27,160 చదరపు అడుగుల విస్తీర్ణం. ఖరీదు 369 కోట్లు. అంటే, చదరపు అడుగుకి దాదాపు రూ.1.36 లక్షలు పెట్టి కొన్నారు. ఆ లెక్కన దేశంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ ఫ్లాట్‌గా నిలిచింది ఈ డీల్. అయితే ఈ అపార్ట్‌మెంట్ ఇంకా నిర్మాణ దశలోనే ఉందట. 2026 జూన్ కల్లా పూర్తి అవుతుందని తెలుస్తోంది.
జేపీ తపారియా కుటుంబం ‘ఫెమి కేర్’ పేరుతో ఫిమేల్ హెల్త్ కేర్ వ్యాపారంలో ఉంది. 1990లో కంపెనీని స్టార్ట్ చేశారు. 2015లో ఫెమి కేర్‌ను 4,600 కోట్లకు మైలాన్‌కు అమ్మేశారు. గతేడాది వారి ఐకేర్ వ్యాపారమైన వైట్రిస్‌ను సైతం 2,460 కోట్లకు వదులుకున్నారు. ఆ డబ్బుతోనే కావొచ్చు.. ఇప్పుడు దేశంలోకే ఖరీదైన ట్రిప్లెక్స్ ఫ్లాట్‌ను 369 కోట్లు పెట్టి కొనడం హాట్ టాపిక్‌గా మారింది.
తపారియా డీల్ కంటే ముందు.. ఇటీవలే ‘బజాజ్ ఆటో’ ఛైర్మన్ నీరజ్ బజాజ్ 252 కోట్లతో ఇదే లోధా గ్రూప్ నుంచి ఖరీదైన ఫ్లాట్‌ని కొనుగోలు చేశారు. 18,008 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడంతస్తుల ఫ్లాట్‌ను రూ.252.5 కోట్లకు తీసుకున్నారు.
జేపీ తపారియా, నీరజ్ బజాజ్‌లనే కాదు, ఇటీవల కాలంలో చాలా మంది ప్రముఖులు భారీగా ఇళ్లు కొంటున్నారు. గత నెలలో వెల్‌స్పన్ గ్రూప్ ఛైర్మన్ బీకే గోయెంకా రూ.230 కోట్లతో ముంబైలోని వర్లీ ఏరియాలో ఓ అపార్ట్‌మెంట్ పెంట్‌హౌస్‌ను కొన్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో డీమార్ట్ (Dmart) అధినేత రాధాకిషన్ దమానీ కుటుంబ సభ్యులు, సహచరులు రూ.1,238 కోట్లతో 28 ఫ్లాట్లను కొని సంచలనంగా నిలిచారు. నుగోలు చేసింది.
గత వారం ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ DLF.. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లోని తన హౌసింగ్ ప్రాజెక్ట్‌లో రూ.7 కోట్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన 1,137 లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను.. 8,000 కోట్లకు.. కేవలం 3 రోజుల్లోనే అమ్మేసి సంచలనంగా నిలిచింది. ఇలా వరుస డీల్స్‌తో ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ అమాంతం పెరిగింది.