EPAPER
Kirrak Couples Episode 1

Congress: కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తు.. పెద్దలు జానారెడ్డి ‘చేతులు’ కాల్చే ముచ్చట్లు..

Congress: కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తు.. పెద్దలు జానారెడ్డి ‘చేతులు’ కాల్చే ముచ్చట్లు..
jana reddy brs

Congress: ఈ కాంగ్రేసోళ్లు ఉన్నారే.. ఎవరి మాటా వినరు. ఎవరికి వాళ్లే తోపులు. సీనియర్లలో గ్రూపులు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బ్యాచ్‌లు. పార్టీకి డ్యామేజ్ చేసేలా మాటలు. అందుకే అంటారు.. కాంగ్రెస్‌ను ఎవరూ ఓడించలేరు వారిని వారే ఓడించుకుంటారు అని. అట్లుంటది కాంగ్రెస్‌తోని.


కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తు. ఆ మధ్య ఎంపీ కోమటిరెడ్డి లేపారీ కంపు. ఆ తర్వాత.. తానలా అనలేదని, తన వ్యాఖ్యలను ఎడిట్ చేశారంటూ వివరణ ఇచ్చుకున్నారు. లేటెస్ట్‌గా మరో సీనియర్ మోస్ట్ లీడర్, పెద్దలు జానారెడ్డి గారు.. మళ్లీ అలాంటి కామెంట్లే చేయడం కలకలం రేపుతోంది.

తప్పదనుకుంటే బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని అన్నారు జానారెడ్డి. అయితే, ఆ పొత్తు ఉండాలా? వద్దా? అనేది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ఇప్పటికే దేశ ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని.. ఇకముందు కూడా కలిసే అవకాశం ఉందని అన్నారు. జానారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను షేక్ చేస్తున్నాయి.


హాత్ సే హాత్ జోడో పాదయాత్రతో కాంగ్రెస్ బలం పుంజుకుంటోంది. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు బంపర్ రెస్పాన్స్ వచ్చింది. భట్టి యాత్రకూ జనం భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ జెండాలు ఎగురుతున్నాయి. కేడర్‌ ఫుల్ జోష్‌లో ఉంది. అటు, TSPSC పేపర్ లీక్ కేసులో రేవంత్‌రెడ్డి దూకుడుగా ఉంటున్నారు. సంచలన విషయాలు రివీల్ చేస్తున్నారు. నేరుగా కేటీఆర్‌నే టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు చేస్తున్నారు. గవర్నర్‌కు, ఈడీ, సీబీఐ, ఏసీబీకి వరుస ఫిర్యాదులతో రాజకీయంగా బీఆర్ఎస్ సర్కార్ ఇమేజ్‌ను ఫుల్‌గా డ్యామేజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఇంత యాక్టివ్‌గా ఉన్న టైమ్‌లో.. పెద్దలు జానారెడ్డి మళ్లీ కాంట్రవర్సీ కామెంట్లతో పార్టీ శ్రేణులను, ప్రజలను కన్ఫ్యూజన్‌లో పడేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎప్పటికైనా కలిసిపోయే పార్టీలేనా? ఇప్పుడు కాకపోయినా ఎన్నికల తర్వాతైనా పొత్తు ఉంటుందా? అనే అనుమానం వచ్చేలా, ప్రజల్లో చర్చ జరిగేలా.. కోమటిరెడ్డి, జానారెడ్డి లాంటి సీనియర్ల మాటలు ఉంటున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఎంత డ్యామేజ్ చేస్తాయో వారికి తెలియందేమీ కాదు. మరి, తెలిసే ఇలా మాట్లాడుతున్నారా? ఇదంతా రేవంత్‌రెడ్డి దూకుడుకు బ్రేకులు వేసే ప్రయత్నమేనా? అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. రాజకీయాల్లో రిటైర్‌మెంట్ వయసుకు వచ్చిన జానారెడ్డి.. తన సలహాలు, సూచనలతో పార్టీకి పెద్దదిక్కుగా ఉండాలికానీ, ఇలా నష్టం చేసే డైలాగులు వదలడం ఎవరికి లాభం? ఇంకెవరికి నష్టం? ఈ సీనియర్లు ఇక మారరా? అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ అభిమానులు.

Related News

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

YS Jagan: జగన్‌ను లైట్ తీసుకున్న.. కొడాలి నానీ, వంశీ

Black Units Into Action: రంగంలోకి బ్లాక్ యూనిట్.. వణికిపోతున్న ఇజ్రాయెల్

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Big Shock To KCR: కేటీఆర్‌కి మాజీ BRS ఎమ్మెల్యేలు షాక్.. కారణం ఇదేనా?

Big Stories

×