EPAPER

Ayurvedic Medicines : ఆయుర్వేద మందులు.. ఇంట్లోనే తయారు చేసుకుంటే జరిగేది ఇదేనా!

Ayurvedic Medicines : ఆయుర్వేద మందులు.. ఇంట్లోనే తయారు చేసుకుంటే జరిగేది ఇదేనా!

Ayurvedic Medicines : ఆయుర్వేద మందులు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చన్న భావన అందరిలో ఉంది. వైద్యుల వద్దకు వెళ్లకుండా ఎవరికివారే ఇంట్లోనే పరిజ్ఞానం లేకుండా ఔషధాన్ని తయారు చేసుకుంటున్నారు. చివరికి అవి సరిగా పనిచేయక నెపాన్ని ఆయుర్వేదంపై నెడుతున్నారు. అందరికీ ఆయుర్వేద చికిత్స సరిపోదని ప్రచారం కూడా చేస్తున్నారు. మిగతా పనుల విషయంలో నిపుణులను సంప్రదించి వారి అభిప్రాయాలు తీసుకుంటాం. కానీ ఆయుర్వేదం విషయంలో ఎవరికివారే వైద్యం చేసుకోవచ్చన్న ప్రచారంతో ఆయుర్వేదాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఆయుర్వేద ఔషధాలు మనమే తయారు చేసుకోవచ్చనే యూట్యూబ్‌ ఛానల్స్‌ వేలల్లో ఉండవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆయుర్వేద మందులు ఎక్కువగా వాడుతున్నారా అంటే అదీ లేదు. ఎవరైనా ఇంట్లోనే మందు తయారు చేసుకోవచ్చని చెబితే ఏమీ ఆలోచించకుండా అవి చేస్తూ.. పనిచేయకపోయినా, ఎప్పుడోకప్పుడు పనిచేస్తాయనే ఆశతో చిన్న సమస్యని పెద్దగా మార్చుకుని జనం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందుబాటులో ఉన్న ముడి పదార్థాలతో చిన్న సమస్యలకు వైద్యం చేసుకోవడం మంచిదే అయినా, సరైన మోతాదు తెలియకుండా ఇష్టానుసారం వినియోగిస్తే అంతే సంగతులు. అందుకే సొంతగా ఆయుర్వేద మందులు చేసుకోవచ్చన్న ప్రచారాలను తిప్పికొట్టాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. పిల్లల్ని స్కూల్‌కి పంపకుండా మనమే చదువు చెప్పొచ్చన్న ఆలోచన ఎలా ఉంటుందో ఆయుర్వేదం విషయంలోనూ ఇదే జరుగుతోంది. గురువు ఉంటేనే పిల్లలు ఉన్నతస్థానాలకు వెళ్తారు. ఇంకా చెప్పాలంటే శిక్షణ అనేది ఎవరైనా తీసుకోవచ్చు కానీ నిపుణులు అవ్వాలంటేనే ఆ పనిని ఎంతో శ్రద్థగా, ఆసక్తిగా చేయాలి. అంతేగాని ఎవరి పర్యవేక్షణ లేకుండా ఎవరో చెప్పారని చేసుకుంటూ పోతే అది ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది ప్రశ్నార్థకమే.


Tags

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×