EPAPER

IPL: ఐపీఎల్‌కు రంగం సిద్ధం.. జట్ల బలాబలగాలు ఇవే..

IPL: ఐపీఎల్‌కు రంగం సిద్ధం.. జట్ల బలాబలగాలు ఇవే..

IPL: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండుగ రానే వచ్చింది. సిక్సర్లు, బౌండరీలు దంచికొట్టే బ్యాటర్లు, బౌలింగ్‌తో వారికి అడ్డుకట్ట వేసే బౌలర్లు.. ఫ్యాన్స్‌కు మరింత కనువిందు చేయనున్నారు. శుక్రవారం నుంచి సీజన్‌ 16 ప్రారంభం కానుంది.


ఈ లీగ్‌లో సత్తా చాటేందుకు ప్రపంచ స్థాయి ఆటగాళ్లంతా ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సీజన్‌ను డామినేట్ చేసి, బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేందుకు చాలా మంది బౌలర్లు, బ్యాటర్లు రెడీ అయిపోయారు. వారిలో కేవలం టీమిండియా బౌలర్లే కాదు, విదేశీ బౌలర్లూ ఉన్నారు. అహ్మదాబాద్ ,మొహాలీ, లక్నో, హైదరాబాద్ ,బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ,కోల్‌కతా, జైపూర్, ముంబై, గౌహతి, ధర్మశాల వేదికలుగా సీజన్‌ 16 జరుగుతుంది.

డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన తొలిసారే కప్‌ కొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌పై భారీ అంచనాలున్నాయి. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో ఆ టీమ్‌ మరోసారి చాంపియన్‌గా నిలుస్తుందనే జోష్‌లో ఉన్నారు ఫ్యాన్స్‌. గతేడాదితో మొదటిసారిగా లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌.. అద్భుతమైన ఆట తీరుతో 14 మ్యాచ్‌ల్లో పది గెలిచి పాయింట్స్‌ టేబుల్‌లో టాపర్‌గా నిలిచింది. టీమ్‌ను సమర్థంగా నడిపించిన పాండ్యా.. ఆ అనుభవంతోనే టీమిండియా టీ20 కెప్టెన్‌గా వ్యవహరించాడు .యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఇటీవలే కీలక ఇన్నింగ్స్‌లు ఆడి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటు షమి, రషీద్‌ లాంటి కీలక బౌలర్లు గుజరాత్‌కు ఉన్నారు. మొత్తంగా గుజరాత్‌ టీమ్‌ ఎంతో బలంగా కనిపిస్తోంది.


గత సీజన్‌ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఈ సీజన్‌లోనూ అదరగొట్టేందుకు లక్నో, గుజరాత్‌ పట్టుదలతో ఉన్నాయి. కెప్టెన్‌ రాహుల్‌ ఫామ్‌ ఒకింత కలవరపెడుతున్నా..తనదైన రోజైన ప్రత్యర్థి బౌలర్ల దుమ్ముదులుపడంలో ముందుండే రాహుల్‌ ఒకసారి టచ్‌లోకి వస్తే తిరుగుండకపోవచ్చు.రాహుల్‌కు తోడు డికాక్‌, స్టొయినిస్‌, పూరన్‌, మార్క్‌ వుడ్‌, కృనాల్‌ పాండ్యా, దీపక్‌ హుడా జతకలిస్తే లక్నో దశ తిరిగినట్లే.

ఈసారి తమదే కప్పు అంటూ గత పదిహేనేళ్లుగా ప్రతీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అభిమాని చెబుతున్న మాట ఇది . ప్రతీ సీజన్‌ ఆరంభంలో ఈసారి కప్‌ మనదే అంటూ బరిలోకి దిగడం.. ఓటములతో నిరాశపర్చడం ఆర్‌సీబీకి అలవాటుగా మారింది. డుప్లెసీ కెప్టెన్సీలో గతేడాది ప్లేఆఫ్స్‌ వరకు వెళ్లి రాజస్థాన్‌ చేతిలో ఓటమిపాలైంది. దినేశ్‌ కార్తీక్‌, రజత్‌ పటీదార్‌, డుప్లెసీ బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడగా…. స్పిన్నర్‌ హసరంగ 26 వికెట్లతో సెకండ్‌ బెస్ట్‌గా నిలిచాడు. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కేవలం ఒక హాఫ్‌ సెంచరీ మాత్రమే సాధించాడు. అయితే గత ఆరు నెలలుగా కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉండడం ఈసారి ఆర్సీబీకి కలిసొచ్చే ఛాన్స్‌ ఉంది. ఆల్‌రౌండర్లు మ్యాక్స్‌వెల్‌, హసరంగ కీలక పాత్ర పోషించనున్నారు. బౌలింగ్‌లో సిరాజ్‌, హర్షల్‌ ప్రధాన పేసర్లు కాగా హాజెల్‌వుడ్‌ గాయంతో పలు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

మరోవైపు యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ గాయంతో ఈ సీజన్‌కు దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పుడు డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్సీలో బరిలోకి దిగుతోంది. 2016లో సన్‌రైజర్స్‌ను విజేతగా నిలిపిన వార్నర్‌ ఢిల్లీని కూడా టైటిల్‌ దిశగా నడిపిస్తాడని ఆశిస్తున్నారు ఫ్యాన్స్‌. అయితే చివరి సీజన్‌ డీసీని నిరాశపరిచ్చింది. 14 లీగ్‌ మ్యాచ్‌ల్లో ఏడు ఓడి, ఏడు గెలవడంతో.. 2018 తర్వాత తొలిసారి ప్లేఆఫ్స్‌కు చేరకుండానే వెనుతిరిగింది. గత వేలంలో బ్యాటింగ్‌ను బలోపేతం చేసేందుకు ఫిల్‌ సాల్ట్‌, రొసోలను తీసుకుంది. మొత్తానికి వార్నర్‌, పృథ్వీ షా, మార్ష్‌, సర్ఫరాజ్‌, పావెల్‌లతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా కనిపిస్తోంది. మనీష్‌ పాండే, అక్షర్‌ పటేల్‌ లోయరార్డర్‌లో రాణించగలరు. ఇక వికెట్‌ కీపర్‌గా ఎవరికి అవకాశం ఇస్తారనేది తేలాల్సి ఉంది. స్పెషలిస్ట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌ను వేలానికి ముందే రిలీజ్‌ చేసింది. దీంతో పెద్దగా అనుభవం లేని సర్ఫరాజ్‌, పాండే, సాల్ట్‌లలో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంది.

కొత్త కెప్టెన్‌ నితీశ్‌ రాణా కెప్టెన్సీలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది కోల్‌కతా నైట్‌రైడర్స్‌. 2012, 2014లో విజేతగా నిలిచిన కేకేఆర్‌ గతేడాది ఏడో స్థానంలో నిలిచింది. శ్రేయాస్‌ అయ్యర్‌ గాయంతో దూరమవడం బ్యాటింగ్‌లో దెబ్బతీయనుందిటాపార్డర్‌లో రాణా, రింకూ సింగ్‌, జగదీషన్‌పైనే ఆధారపడి ఉంది. మిడిలార్డర్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌, రస్సెల్‌ స్థాయికి తగ్గట్టు వేగంగా ఆడితే ప్రత్యర్థులకు సవాల్‌ విసరగలదు. బౌలింగ్‌లో గతేడాది ఉమేశ్‌ యాదవ్‌, రస్సెల్‌, సౌథీ, నరైన్‌ ఫర్వాలేదనిపించారు. పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఈ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోగా, గత వేలంలో పేసర్‌ శార్దూల్‌ను తీసుకున్నారు.

క్రికెట్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు కామెంటేర్ గా వ్యవహరించేందుకు రెడీ అయిపోయారు హీరో నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే స్టార్ స్పోర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. రేపు ప్రారంభం కానున్న ఐపీఎల్ ఓపెనింగ్‌కు బాలయ్య బాబు కామెంటరీ చేయనున్నారు

Related News

Women’s T20 World Cup: పాక్‌పై విక్టరీ.. టీమిండియా సెమీస్ చేరడం ఎలా..?

IND vs AUS: బంగ్లాకు ట్రైలర్‌ మాత్రమే..ఆస్ట్రేలియాకు సినిమా చూపించనున్న టీమిండియా..?

IND vs BAN: విడాకుల తర్వాత పాండ్యా విధ్వంసం.. బంగ్లాపై భారత్ ఘన విజయం!

IPL 2025: ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్‌పై కొత్త పంచాయితీ…చిక్కుల్లో ఓనర్లు?

Hardik Pandya: పాండ్యాకు 18 కోట్లు దండగే..ముంబై సంచలన నిర్ణయం ?

Ind vs Ban 1st T20: ఇవాళ బంగ్లా, టీమిండియా మధ్య టీ20..జట్లు, టైమింగ్స్ వివరాలు ఇవే !

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

×