EPAPER
Kirrak Couples Episode 1

Pulivendula: భరత్‌యాదవ్‌కు వివేకా హత్య కేసుతో సంబంధం ఇదే.. మరి, గన్ లైసెన్స్ ఎలా ఇచ్చారు?

Pulivendula: భరత్‌యాదవ్‌కు వివేకా హత్య కేసుతో సంబంధం ఇదే.. మరి, గన్ లైసెన్స్ ఎలా ఇచ్చారు?

Pulivendula: పులివెందులలో ధన్‌ధనాధన్. పట్టపగలు, నడిరోడ్డుపై తుపాకీ పేల్చాడు. ఒకరిని దారుణంగా హత్య చేశాడు. మరొకరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. చంపింది మామూలోడు కాదు. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొన్న వ్యక్తి. అలాంటి వాడికి ఎంచక్కా గన్ లైసెన్స్ కూడా ఇచ్చేశారు. ఒంట్లో పొగరు.. చేతిలో గన్.. రెచ్చిపోయాడు. డిష్యూం డిష్యూం అని చిన్నపిల్లల తుపాకీ ఆటలా కాల్చిపడేశాడు. పులివెందులలో జరిగిన ఈ ఫైరింగ్.. స్టేట్ వైడ్ రీసౌండ్ వస్తోంది. భరత్ యాదవ్‌కు గన్ లైసెన్స్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ, అతనికి వివేకా హత్య కేసుకు సంబంధం ఏంటి?


వివేకా మర్డర్ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరినే భరత్‌కుమార్ యాదవ్ పేరు వెళ్లడించాడు. ఆ కేసులో వాస్తవాలు చెప్పకుండా, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పేర్లు బయటపెట్టకుండా ఉండేందుకు దస్తగిరిని ప్రలోభపెట్టాడు భరత్‌కుమార్‌. “నువ్వు వాళ్ల మీద చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు. వాళ్లు నిన్ను వదిలిపెట్టరు. చంపుతారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ప్రెస్‌మీట్‌ పెట్టి ఇప్పటివరకూ చెప్పిందంతా అబద్ధమని చెప్పు. నీకు డబ్బులు ఇప్పిస్తాను, ఇంకేమైనా సాయం కావాలన్నా చేయిస్తాను” అంటూ దస్తగిరికి వార్నింగ్ కూడా ఇచ్చాడట భరత్‌కుమార్‌. ఆ మేరకు వాంగ్మూలం ఇచ్చాడు దస్తగిరి.

“కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి.. తోట దగ్గరకు రమ్మంటున్నారని ఓ రోజు భరత్‌యాదవ్‌ నన్ను పిలిచాడు. నేను వెళ్లలేదు. తర్వాత భరత్‌యాదవ్‌, పులివెందులకు చెందిన న్యాయవాది ఓబుల్‌రెడ్డి నన్ను హెలిప్యాడ్‌ వద్దకు పిలిచారు. జాగ్రత్తగా మసలుకో. అనవసరపు మాటలు మాట్లాడకు” అంటూ తనను మరోసారి బెదిరించారని దస్తగిరి సీబీఐకి చెప్పాడు.


ఆ భరత్ కుమారే ఇప్పుడు పులివెందులలో తుపాకీతో కాల్పులు జరిపింది. మరి, అతనికి గన్ లైసెన్సు ఎలా ఇచ్చారు? ఎందుకిచ్చారు? లైసెన్సు ఇవ్వొద్దని జిల్లా యంత్రాంగానికి స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు నివేదించినా ఎందుకు పట్టించుకోలేదు? అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న భరత్‌కుమార్‌ యాదవ్‌ తన ప్రాణాలకు హాని ఉందంటూ 2021 నవంబరులో సీబీఐ అధికారులకు, కడప ఎస్పీకి లేఖ రాశాడు. సాక్షుల రక్షణ పథకం కింద తుపాకీ లైసెన్సు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు సిఫార్సు చేశాంమని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గత నెల 26నే అతని దగ్గరున్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియటంతో ఈ నెల 24న మళ్లీ ఆ తుపాకీని భరత్ కుమార్ యాదవ్‌కు తిరిగి ఇచ్చేశారు. గన్ చేతికొచ్చిన నాలుగు రోజులకే ధనాధన్ ఫైరింగ్ చేసి ఒకరి ప్రాణాలు తీయడం కలకలం రేపుతోంది.

Related News

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Big Stories

×