EPAPER

Antarctica:- అంటార్కిటికాకు తోడుగా ఇండియా.. వాటిని కాపాడడానికి..

Antarctica:- అంటార్కిటికాకు తోడుగా ఇండియా.. వాటిని కాపాడడానికి..

Antarctica:- కేవలం అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే కాదు.. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఇతర దేశాలకు సాయం చేస్తూ.. సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ముందుకొస్తున్నాయి. అందులో ఒకటి ఇండియా. ఇప్పటికే ఇండియా.. ఎన్నో ఫారిన్ దేశాలకు సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనల విషయంలో సాయం చేసింది. ఇప్పుడు అంటార్కిటికాను తన సంపదనను కాపాడుకోవడానికి సాయం చేయనుంది.


అంటార్కిటికాలో సముద్ర సంపద ఎక్కువగా ఉంటుంది. అక్కడి ఉష్ణోగ్రతల వల్ల ఆ ఖండంలో మనుషులు ఎవరూ జీవించకపోయినా సముద్రాల్లో మాత్రం ఎన్నో రకాల జీవరాశులు జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. అందుకే అంటార్కికిటాలో రెండు మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ (ఎమ్పీఏ)లను ప్రారంభించాలని ఇండియా నిర్ణయించుకుంది. ఇటీవల ఈ విషయాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ స్వయంగా ప్రకటించారు.

ఎమ్పీఏ అనేది సముద్ర సంపదను కాపాడడానికి, ఎకోసిస్టమ్ సర్వీసులను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అంటార్కిటికాలో ఉండే దక్షిణ సముద్రం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాల్లో దాదాపు 10 శాతాన్ని కవర్ చేస్తుంది. అది దాదాపు 10 వేల రకాల జీవరాశులకు ఆశ్రయం ఇస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల పలు రకాల జీవరాశులకు ఆ సముద్రంలో జీవనం కొనసాగించడం కష్టంగా మారింది.


క్రిల్ అనే 6 సెంటిమీటర్ల పొడవైన ఫిష్‌ను కమర్షియల్‌గా పెంచడం వల్ల ఇతర జంతువులకు ఇబ్బందులు కలిగే పరిస్థితి ఏర్పడింది. 2022లో చేసిన స్టడీ ప్రకారం.. క్రిల్ ఫిష్ పెంపకం అనేది ఇతర ప్రపంచాల దేశాలతో పోలిస్తే.. అంటార్కిటికాలోనే ఎక్కువ. వాతావరణంలో మార్పులు, కమర్షియల్ ఫిషింగ్ అనేవి అంటార్కిటికా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే అంటార్కిటికాకు తోడుగా ఇండియా అడుగులు వేయాలనుకుంటోంది.

వర్చువల్ రియాలిటీలో అడవుల పెంపకం..

for more updates follow this link:-Bigtv

Tags

Related News

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

×